మాయమాటలు చెప్పి దింపేశారంటూ ప్రయాణికులు ఆందోళన

మాయమాటలు చెప్పి దింపేశారంటూ ప్రయాణికులు ఆందోళన

Phani CH

|

Updated on: Nov 21, 2023 | 9:06 PM

బెంగళూరులోని ఇండిగో విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఆరుగురు ప్రయాణికులతో విమానం నడిపేందుకు ఇష్టపడని సిబ్బంది.. వారికి మాయమాటలు చెప్పి దింపేశారు. గ్రౌండ్‌ సిబ్బంది తమను తప్పుదోవ పట్టించారని తెలుసుకున్న ఆ ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఆదివారం రాత్రి కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది ఘటన. అసలేం జరిగిందంటే.. ఇండిగో విమానం అమృత్‌సర్‌ నుంచి చెన్నై కి బయలుదేరింది.

బెంగళూరులోని ఇండిగో విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఆరుగురు ప్రయాణికులతో విమానం నడిపేందుకు ఇష్టపడని సిబ్బంది.. వారికి మాయమాటలు చెప్పి దింపేశారు. గ్రౌండ్‌ సిబ్బంది తమను తప్పుదోవ పట్టించారని తెలుసుకున్న ఆ ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఆదివారం రాత్రి కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది ఘటన. అసలేం జరిగిందంటే.. ఇండిగో విమానం అమృత్‌సర్‌ నుంచి చెన్నై కి బయలుదేరింది. చెన్నై చేరుకోవడానికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. అందరూ దిగిపోయాక.. చెన్నై వెళ్లేందుకు ఆరుగురు ప్రయాణికులు మాత్రమే మిగిలారు. దీంతో.. తక్కువ మంది ప్రయాణికులతో విమానాన్ని నడిపేందుకు ఇష్టపడని ఇండిగో సిబ్బంది వారిని తెలివిగా దింపేశారు. అదే విషయాన్ని ఓ ప్రయాణికుడు చెప్పుకొచ్చారు. ప్రయాణికులు దిగిపోయాక తాను విమానంలోనే కూర్చున్నాననీ తనతో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారనీ చెప్పారు. ఇంతలో ఇండిగో గ్రౌండ్‌ సిబ్బంది నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని చెన్నైకి వెళ్లేందుకు మరో ప్రత్యామ్నాయ విమానం ఉందని.. తన బోర్డింగ్‌ పాస్‌ కూడా సిద్ధంగా ఉందంటూ సిబ్బంది ఒకరు మాట్లాడారనీ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ దున్న ఖరీదు రూ.11 కోట్లు !! అంత రేటు ఎందుకంటే ??

ఏమి ఇకమత్‌రా బాబోయ్‌.. చిన్న టెట్రా ప్యాక్ తెరిచి చూస్తే.. కళ్లు జిగేల్‌

ఇజ్రాయెల్‌ నౌకను ఇలా హైజాక్‌ చేశారు !! తాజాగా విడుదల చేసిన హూతీ రెబెల్స్‌

రన్‌వే నుంచి సముద్రంలోకి విమానం !! చూసి షాక్‌ తిన్న స్థానికులు

కార్తీక మాసంలో ఏ దీపంతో ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది ??