ఓర్నాయనో ఇదెక్కడి కథ.. తాళి కట్టాలంటే చర్నాకోల దెబ్బలు తినాల్సిందే..!
పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల బంధానికి పునాది.. రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి వారధి. అందుకే పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. పచ్చని పందిళ్ళు, బంధుమిత్రుల సందడి, మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ, మూడు ముళ్ళు, ఏడు అడుగులతో రెండు జీవితాలను ఒక్కటి చేసే వేడుక.. ఈ వివాహ క్రతువు వారి వారి సంప్రదాయాల ఆచారాల ప్రకారం జరుగుతాయి.
పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల బంధానికి పునాది.. రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి వారధి. అందుకే పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. పచ్చని పందిళ్ళు, బంధుమిత్రుల సందడి, మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ, మూడు ముళ్ళు, ఏడు అడుగులతో రెండు జీవితాలను ఒక్కటి చేసే వేడుక.. ఈ వివాహ క్రతువు వారి వారి సంప్రదాయాల ఆచారాల ప్రకారం జరుగుతాయి. అయితే.. కొందరి ఆచార వ్యవహారాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కొందరు వరుడికి వధువుతో పాటు భార్య కానుకలు ఇస్తారు. కానీ వైఎస్సార్ కడప జిల్లాలోని భూచెపల్లి వంశీయులు పెళ్లిలో మాత్రం ఈ మొత్తం తతంగాలతో పాటు పెళ్లి కుమారుడికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం ఆచారంగా పాటిస్తున్నారు.
సాధారణంగా వధూవరులు తలపై జీలకర్ర, బెల్లం పెట్టి వరుడు వధువు మెడలో తాళికట్టి తలంబ్రాలు పోవడంతో పెళ్లి తంతు ముగుస్తుంది. కానీ భూచెప్పల్లి వంశీయుల పెళ్లి ఇంతటితో ముగియదు. వీటన్నిటితో పాటు వరుడికి చర్నాకోలతో మూడు దెబ్బలు కొట్టిన తర్వాతే వివాహం పూర్తయినట్లు భావిస్తారట. పెళ్లి పీటలపై వధువు మెడలో వరుడు తాళికట్టిన తర్వాత అతన్ని కుటుంబ సభ్యులు చర్నాకోలతో మూడు దెబ్బలు కొడతారు.. ఈ కొట్టే ఆచారం వీరి వంశంలో తరతరాలుగా వస్తుందట. అసలు ఈ ఆచారం ఎలా మొదలైందంటే వందల ఏళ్ల క్రితం భూచెప్పల్లి వంశీయులు గంగమ్మ ఆలయం నుంచి ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారట. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఐదు చర్నాకోలలు కనిపించాయట. వెంటనే ఆ వంశీయులు ఆలయంలోకి వెళ్లి గంగమ్మను తప్పు జరిగిందని క్షమించమని వేడుకున్నారట. దీంతో గంగమ్మ ప్రత్యక్షమై మీ వంశీయులు వివాహ సమయంలో వరుడికి చర్నాకోలతో మూడు దెబ్బలు కొట్టాలని చెప్పిందట. అప్పటి నుంచి ఆ ఆచారాన్ని వారి వంశంలో జరిగే ప్రతి పెళ్ళిలోనూ కొనసాగిస్తూ వస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని భద్రంపల్లి, తుండూరు, ఇనగలూరు, లోమడ, భూచెప్పల్లి, బోడివారిపల్లె, మల్లేల, ఆగడూరు, సంతుకువూరు గ్రామాల పరిధిలో భూచెప్పల్లి వంశీయుల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా పెళ్ళిల్ల సమయంలో నేటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

