కిస్మిస్ గణపతి.. బాదం గణపతి.. ఆకట్టుకుంటున్న గణనాధులు
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా భక్తులు మంటపాలు ఏర్పాటు చేసి గణనాధుని పూజిస్తున్నారు. అయితే ఈసారి పర్యావరణ హితం కోరి ఎక్కవ శాతం మట్టిగణపతిని పూజించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. అయితే కొందరు మాత్రం ఒకడుగు ముందుకేసి వివిధ రకాల వస్తువులతో గణపతి రూపాలను రూపొందించి పూజిస్తున్నారు.
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా భక్తులు మంటపాలు ఏర్పాటు చేసి గణనాధుని పూజిస్తున్నారు. అయితే ఈసారి పర్యావరణ హితం కోరి ఎక్కవ శాతం మట్టిగణపతిని పూజించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. అయితే కొందరు మాత్రం ఒకడుగు ముందుకేసి వివిధ రకాల వస్తువులతో గణపతి రూపాలను రూపొందించి పూజిస్తున్నారు. ఒక చోట రూపాయి నాణేలతో తయారు చేసిన గణపతి, మరోచోట కొబ్బరికాయలతో, రుద్రాక్షలతో ఇలా రకరకాల పదార్ధాలతో వినాయక ప్రతిమలు తయారుచేసి పూజిస్తున్నారు. కాగా తెలంగాణలోని ఓరుగల్లులో బఠానీలు, బాదం గింజలు, పోకచెక్కలతో గణపతులను తయారు చేసి పూజిస్తున్నారు. ఓరుగల్లులో కొలువైన ఈ వైవిద్యమైన గణపతి విగ్రహాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి..ప్రతియేటా కొత్త కొత్త ఆకారాలు, అలంకారాలలో గణపతిని తయారుచేసే ఉత్సవ కమిటీలు ఈసారి కూడా వింత వింత ఆకారాలతో గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేస్తున్నారు. భారీ గణపతులు.. ఎత్తైన గణపతి విగ్రహాలే కాదు.. డిఫరెంట్ ఆకారాలు అలంకరణలతో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాలు ఓరుగల్లు లో చూపరులను అబ్బుర పరుస్తున్నాయి. వివిధ ఆకారాలలో ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్టించిన గణపతి విగ్రహాలు చూడడం కోసం భక్తులు బారులు తీరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!