యూఎఫ్‌వో ఆకారంలో మేఘాలు.. టర్కీ ప్రజలు థ్రిల్
టర్కీలో మేఘాలు అక్కడ ప్రజల్ని థ్రిల్ చేశాయి. బుర్సా పట్టణంలో యూఎఫ్‌వో - అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ తరహాలో మేఘాలు అల్లుకున్నాయి.
టర్కీలో మేఘాలు అక్కడ ప్రజల్ని థ్రిల్ చేశాయి. బుర్సా పట్టణంలో యూఎఫ్‌వో – అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ తరహాలో మేఘాలు అల్లుకున్నాయి. దీంతో అక్కడ ప్రజలు సంబ‌్రమామాశ్చర్యంలో తేలిపోయారు. దాదాపు గంట సేపు ఆ మబ్బులు యూఎఫ్‌వో తరహాలో ఉండిపోయాయి. ఆకాశంలో కనిపించిన ఆ అద్భుతాన్ని స్థానికులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. సూర్యోదయం సమయంలో మేఘాలు యూఎఫ్‌వో తరహాలో దర్శనమిచ్చాయి. టర్కీ శాస్త్రవేత్తలు ఆ అద్భుతాన్ని లెంటిక్యులర్ మేఘాలుగా తేల్చారు. కంటి అద్దాల తరహాలో ఆ మేఘం ఏర్పడినట్లు పేర్కొన్నారు. కానీ ఇంటర్నెట్‌లో మాత్రం అదో యూఎఫ్‌వో అన్నట్లు యూజర్లు రియాక్ట్ అయ్యారు. యూఎఫ్‌వో మేఘానికి చెందిన వీడియో ఒకటి వైరల్ కూడా అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్ కాకండి
కారుకి బ్రేక్ వెయ్యబోతే సీన్ రివర్స్.. ఏంజరిగిందో చూడండి !!
ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!