‘తప్పు చేశావ్ నాన్న’ .. తండ్రి తప్పును సరిదిద్దిన కూతురు వీడియో
యూపీ రాష్ట్రం బరేలీ పోలీసు ఐజీ..తన కింద పనిచేసే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసారు. మైనర్‌ను వేధించాడన్న ఆరోపణలతో కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ ఐజీ కుమార్తె అయిన అనూరా సింగ్ లాయర్. ఈ కేసులో ఆమె బాధిత కానిస్టేబుల్ తరఫున కోర్టులో తన వాదనలు వినిపించింది. ఆమె తన ఐజీ తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పని న్యాయస్థానంలో పోరాటం చేసింది. ఇంతకీ ఎవరా కుమార్తె? ఆమె కథేంటో చూద్దాం
పోలీసు కానిస్టేబుల్ తౌఫిక్ అహ్మద్ ఓ బాలికను రైల్వేస్టేషన్‌లో వేధించాడనే ఆరోపణలున్నాయి. బాధితురాలు మైనర్ కావడంతో రైల్వే పోలీసులు తౌఫిక్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కింది కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించినా, ఐజీ రాకేష్ సింగ్ శాఖాపరమైన విచారణ జరిపి అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదే అంశాన్ని సవాలు చేస్తూ తౌఫిక్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన తరుఫున వాదించమని అనురా సింగ్‌ను కోరాడు. వాస్తవానికి ఆ అనూరా సింగ్.. ఐజీ రాకేష్ సింగ్ కుమార్తె అని అతడికి తెలియదు. కోర్టులో కానిస్టేబుల్ తరఫున అనురా సింగ్ తన వాదనలు వినిపించింది. పోలీసు శాఖ పద్ధతులు పాటించలేదని, ఉద్యోగం తొలగింపు చట్టబద్ధంగా లేదని పలు ఆధారాలు హైకోర్టు ముందుంచింది. ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. తౌఫిక్‌పై పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. తౌఫిక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని వీడియోల కోసం :