వేషం చూస్తే అపర భక్తుడు.. చేసేది మాత్రం..
ఇటీవల దొంగలు గుడులు, బడులు ఏవీ వదలడంలేదు. ఎక్కడ సందు దొరికినా చేతివాటం చూపిస్తున్నారు. చేతికందినది పట్టుకొని పారిపోతున్నారు. కార్తీక, ధనుర్మాసంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. దీంతో ఇప్పుడు దొంగల దృష్టి గుళ్లపై పడింది. దైవదర్శనానికి వచ్చే భక్తుల విలువైన వస్తువులు కొట్టేస్తూ ఎవరికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. నిన్నకాక మొన్న ఓ దొంగ అందరూ చూస్తుండగానే రోడ్డుపక్కన పార్క్‌చేసిన బైకుకి తగిలించి ఉన్న ఆయిల్ డబ్బా ఎత్తుకెళ్లిపోయాడు.
ఇటీవల దొంగలు గుడులు, బడులు ఏవీ వదలడంలేదు. ఎక్కడ సందు దొరికినా చేతివాటం చూపిస్తున్నారు. చేతికందినది పట్టుకొని పారిపోతున్నారు. కార్తీక, ధనుర్మాసంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. దీంతో ఇప్పుడు దొంగల దృష్టి గుళ్లపై పడింది. దైవదర్శనానికి వచ్చే భక్తుల విలువైన వస్తువులు కొట్టేస్తూ ఎవరికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. నిన్నకాక మొన్న ఓ దొంగ అందరూ చూస్తుండగానే రోడ్డుపక్కన పార్క్‌చేసిన బైకుకి తగిలించి ఉన్న ఆయిల్ డబ్బా ఎత్తుకెళ్లిపోయాడు. తాజాగా తెనాలిలోని గంగానమ్మపేట శివాలయం పరిసర ప్రాంతాల్లో టూ వీలర్స్ ను టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. బైక్ డిక్కీలు, సైడ్ బాక్స్ ల్లో దాచుకున్న డబ్బులు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులను కొట్టేస్తున్నారు. భక్తులు హాడావుడిగా వచ్చి బైక్ పార్క్ చేసి ఆలయంలోకి వెళతారు. కొద్దీ సేపటి తర్వాత బయటకు వచ్చి చూస్తే బైక్ లో పెట్టిన నగదు, సెల్ ఫోన్లు మాయం అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత !! చలికి గజగజా వణుకుతున్న మూగజీవులు