ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. తప్పిన ఘోర ప్రమాదం

|

Jun 10, 2024 | 5:12 PM

ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం విమానాశ్రయంలోని ఓ రన్‌వే పై ఓ వైపు ఎయిర్‌ఇండియాకు చెందిన విమానం టేకాఫ్‌ అవుతుండగానే అదే రన్‌వేపై వెనుక ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్‌ అయింది. టేక్‌ఆఫ్‌ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం విమానాశ్రయంలోని ఓ రన్‌వే పై ఓ వైపు ఎయిర్‌ఇండియాకు చెందిన విమానం టేకాఫ్‌ అవుతుండగానే అదే రన్‌వేపై వెనుక ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్‌ అయింది. టేక్‌ఆఫ్‌ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అసలు ఈ ఘటన జరగడానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కమ్యూనికేషన్‌ లోపమే కారణమని వెల్లడైంది. ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానాన్ని పొరపాటున ల్యాండింగ్‌కు అనుమతిచ్చినట్లు తేలింది. ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొన్ని సెకన్ల ముందు ఇదే రన్‌వేపై తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయింది. ఎయిర్‌ఇండియా విమానం గాల్లోకి లేవడం సెకన్లు ఆలస్యమైనా భారీగా ప్రాణ నష్టం జరిగేది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ఏడు గంటలు కష్టపడి వెదికి తెచ్చిన టీమ్

కంగన చెంపపై కొట్టిన కానిస్టేబుల్ కు బంగారు ఉంగరం.. ఎవరిస్తున్నారంటే ??

నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ

విడాకుల కేసులో ఫొటోలు, వీడియోలు మాత్రమే సాక్ష్యం కావు.. ఢిల్లీ హైకోర్టు

తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే

Follow us on