కడుపులో విపరీతమైన నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఎక్స్‌రే రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్

కడుపులో విపరీతమైన నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువతి.. ఎక్స్‌రే రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్

Phani CH

|

Updated on: Jul 23, 2022 | 8:48 PM

ఓ యువతికి పొత్తి కడుపులో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులకు చెబితే.. ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చారు. అది వేసుకున్నాక నొప్పి తగ్గుతుందిలే అని భావిస్తే.. విపరీతంగా పెరిగింది.

ఓ యువతికి పొత్తి కడుపులో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులకు చెబితే.. ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చారు. అది వేసుకున్నాక నొప్పి తగ్గుతుందిలే అని భావిస్తే.. విపరీతంగా పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసిన అనంతరం రిపోర్ట్స్ చూసి స్టన్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కీలోని తూర్పు వాన్ ప్రావిన్స్‌లో 24 ఏళ్ల యువతి పొత్తికడుపు నొప్పితో వాన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్‌కు వెళ్లింది. టెస్టుల నివేదికలు చూసిన అనంతరం ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నాయని గుర్తించి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ చేస్తున్న క్రమంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ కంగుతిన్నారు. ఎందుకంటే ఆమె కడుపులో గోర్లు, సూదితో సహా 158 మెటల్ వస్తువులు కనిపించాయి. వాటన్నింటిని జాగ్రత్తగా తొలగించారు. రెండున్నర గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో నెయిల్ క్లిప్పర్స్, పాకెట్ నైఫ్, గోర్లు, సూదులు, స్క్రూలు, తాళం చెవులు సహా 158 వస్తువులు బయటకు తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాత నువ్వు కేక !! హుక్కా దమ్ము కొట్టటంలో ఈయన స్టయిలే వేరు.. చూస్తే అవాక్కే !!

వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Viral: ఇంత పెద్ద అరటిగెలని జీవితంలో చూసి ఉండరు.. ఎన్ని కాయలో తెల్సా

Published on: Jul 23, 2022 08:48 PM