వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !! వైరల్‌ అవుతున్న వీడియో

|

Apr 26, 2024 | 6:39 PM

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇంటినుంచి బయటకు రావాలంటే బయపడుతున్నారు. మరి ఎండలో పనిచేసే వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. రవాణా వ్యవస్థలో ఎండైనా, వానైనా కొందరు డ్రైవర్లు వాహనాలను నడపాల్సిందే. అలా ఓ ట్రక్‌ డ్రైవర్‌ మండుతున్న ఎండలో వాహనాన్ని నడుపుతుండగా వేసవి తాపాన్ని తట్టుకోలేక అతను చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇంటినుంచి బయటకు రావాలంటే బయపడుతున్నారు. మరి ఎండలో పనిచేసే వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. రవాణా వ్యవస్థలో ఎండైనా, వానైనా కొందరు డ్రైవర్లు వాహనాలను నడపాల్సిందే. అలా ఓ ట్రక్‌ డ్రైవర్‌ మండుతున్న ఎండలో వాహనాన్ని నడుపుతుండగా వేసవి తాపాన్ని తట్టుకోలేక అతను చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. రోడ్డుపై ట్రక్‌ నడుపుతూ వెళ్తున్న అతను, డ్రైవింగ్ సీటు ప‌క్కనే ఒక బ‌కెట్‌లో చ‌ల్లటి నీళ్లు పెట్టుకున్నాడు. అందులో ఒక మ‌గ్ ఉంచి.. డ్రైవింగ్ చేస్తున్న స‌మ‌యంలో వేడిగా అనిపించినప్పుడ‌ల్లా మగ్‌తో నీళ్లు తీసుకొని తనపై పోసుకుంటున్నాడు. ఇలా వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం కోసం వెరైటీ ఉపాయం ఆలోచించిన ట్రక్‌ డ్రైవ‌ర్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత‌లో బ‌స్సు లేదా ట్రక్ నడిపించ‌డం అనేది ఎంత క‌ష్టం అనే క్యాప్షన్ తో పోస్ట్‌ పోస్ట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు

Follow us on