Noodle Soup Train: రైళ్లు నడిపేందుకు సరికొత్త ఇంధనం నూడుల్స్​ సూప్​.. జపాన్​ లో సరికొత్త ప్రయోగం..

Noodle Soup Train: రైళ్లు నడిపేందుకు సరికొత్త ఇంధనం నూడుల్స్​ సూప్​.. జపాన్​ లో సరికొత్త ప్రయోగం..

Anil kumar poka

|

Updated on: Sep 19, 2022 | 9:48 AM

జపాన్‌లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ చిత్రమైన ప్రయోగం చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. నూడుల్స్ సూప్ తో రైలును నడిపింది. అవును మీరు విన్నది నిజమే. జపాన్ వాసులు


జపాన్‌లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ చిత్రమైన ప్రయోగం చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. నూడుల్స్ సూప్ తో రైలును నడిపింది. అవును మీరు విన్నది నిజమే. జపాన్ వాసులు పంది ఎముకలతో తయారు చేసే టొంకుట్సు రామెన్‌ అనే సూప్‌ అంటే చాలా ఇష్టపడతారు. అలాగే కూరగాయలు, ఇంకా మాంసంతో తయారు చేసే డీప్‌ ఫ్రై టెంపురా అనే వంటకాన్ని కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇళ్లలో, రెస్టారెంట్లలో ఈ వంటకాలు పెద్ద ఎత్తున తయారు చేస్తుంటారు. అదే స్థాయిలో ఈ వంటకాలు వృథా అవుతుంటాయి కూడా. ఈ వృథాను అరికట్టడం, పర్యావరణానికి మేలు చేయడం లక్ష్యంగా.. జపాన్ టాకచిహో రైల్వే అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. వృథా ఆహార పదార్థాల నుంచి బయో డీజిల్ తయారు చేసి రైలును నడపాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను నిషిడా షౌన్‌ అనే రవాణా కంపెనీకి అప్పగించారు. నిషిడా షౌన్ సంస్థ జపాన్‌ లోని పలు రెస్టారెంట్ల నుంచి రామెన్‌ సూప్‌, టెంపురా వంటకాల వ్యర్థాలను సేకరించింది. వాటిని రసాయనాలతో శుద్ధి చేసి.. బయో డీజిల్ ను తయారు చేసింది.మొదట ఈ బయో డీజిల్ తో కొన్ని రైలింజన్లను ప్రయోగాత్మకంగా నడిపి చూసింది. అది విజయవంతం కావడంతో ఇటీవల మియాజాకీ నగరంలో పూర్తిస్థాయిలో ఓ చిన్న ప్రయాణికుల రైలును ఆ వృథా బయో డీజిల్ తో నడిపింది. ఈ రామెన్ సూప్ బయో డీజిల్ తో రైలు వెళుతుంటే.. దాని నుంచి వెలువడిన పొగలు సదరు వంటకం వాసనను వెదజల్లాయని ప్రయాణికులు చెబుతున్నారు.సదరు రైల్వే సంస్థ ఈ ప్రత్యేక రైలు ప్రయాణాన్ని డ్రోన్లతో వీడియో తీసి విడుదల చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Horned Snake: బాబోయ్ కొమ్ములున్న ‘రాక్షసి’ పాము.. ఎప్పుడైనా చూసారా..? హడలెత్తించిందిగా..

Husband harass: 87 ఏళ్ల భార్యపై భర్త శృంగార వేధింపులు.. భరించలేని ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే..

Published on: Sep 19, 2022 09:48 AM