Traffic Police Humanity: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలా కూడా చేస్తారా.? శభాష్ పోలీస్..

Traffic Police Humanity: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలా కూడా చేస్తారా.? శభాష్ పోలీస్..

Anil kumar poka

|

Updated on: Aug 28, 2023 | 9:03 AM

హైదరాబాద్‌లో ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపించినా.. చలాన్ విధిస్తాడనే భ్రమ చాలా మందికి ఉంటుంది. అయితే ఓ ట్రాఫిక్ పోలీస్ ఉంటే కేవలం చలానా విధించడం వరకే కాదనీ.. వారిలోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించారు. ఎండనక, వాననక గంటల తరబడి రోడ్డుపై నిల్చొని ట్రాఫిక్ క్లియర్ చేయడం వారి విధి. అలాగే ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించినా, డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడినా శిక్షించేందుకు సిద్ధంగా ఉంటారు.

హైదరాబాద్‌లో ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపించినా.. చలాన్ విధిస్తాడనే భ్రమ చాలా మందికి ఉంటుంది. అయితే ఓ ట్రాఫిక్ పోలీస్ ఉంటే కేవలం చలానా విధించడం వరకే కాదనీ.. వారిలోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించారు. ఎండనక, వాననక గంటల తరబడి రోడ్డుపై నిల్చొని ట్రాఫిక్ క్లియర్ చేయడం వారి విధి. అలాగే ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించినా, డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడినా శిక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పనులకు నెటిజన్‌లు శభాష్ అంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గుంతలని పూడ్చడం మొదలుకొని, ట్రాఫిక్ సాఫీగా సాగేలా తీసుకుంటున్న చర్యలపై ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజా ట్రాఫిక్ పోలీసులు చేసిన పని వారిపై మరింతం గౌరవాన్ని పెంచుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఎస్సార్ నగర్ ప్రాంతంలో ఒక్కసారిగా వాహనం ఆగిపోయింది. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ఎస్ఆర్‌నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిపోయింది. పదినిమిషాల పాటు అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అయితే సాధారణంగానే రద్దీ ప్రదేశం కావడంతో ఎవరు కూడా వాహనాన్ని తోసేందుకు ముందుకు రాలేదు. దీంతో అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అంబులెన్స్‌ను ముందుకు తోసుకుంటూ.. గమ్యం చేర్చారు. ఇలా ట్రాఫిక్ పోలీసుల సహాయంతో అంబులెన్స్ డ్రైవర్ ఆ మృతదేహాన్ని గమ్యస్థానానికి చేర్చారు. దీన్నంతటిని అక్కడే బిల్డింగ్‌పై ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు చేసిన పనిని హర్షిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..