నాన్‌వెజ్‌ జాతర.. తిన్నవారికి తిన్నంత.. కానీ, లేడీస్ కు నో ఎంట్రీ

|

May 22, 2024 | 9:39 PM

అదో నాన్‌వెజ్‌ జాతర.. ఇక్కడ ఎంత తినగలిగితే అంత తినొచ్చు... తిన్నవారికి తిన్నతం. నాన్‌వెజ్‌ వంటకాలతో ‌ఫెస్టివల్‌..ఓన్లీ ఫర్‌ జంట్స్‌.. లేడీస్‌ నో ఎంట్రీ.. అవును, ఆడవాళ్లకు మాత్రం నో ఎంట్రీ. ఫెస్టివల్‌ అంటున్నారు.. ఆడాళ్లకి ఎంట్రీ లేదంటున్నారు.. పండగంటేనే అంతా కలిసి చేసుకునేది కదా ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా? విడ్డూరం కాదు.. అది అక్కడి ఆచారం. ఇంతకీ ఈ ఫెస్టివల్‌ ఎక్కడో తెలుసా? తమిళనాడులో.

అదో నాన్‌వెజ్‌ జాతర.. ఇక్కడ ఎంత తినగలిగితే అంత తినొచ్చు… తిన్నవారికి తిన్నతం. నాన్‌వెజ్‌ వంటకాలతో ‌ఫెస్టివల్‌..ఓన్లీ ఫర్‌ జంట్స్‌.. లేడీస్‌ నో ఎంట్రీ.. అవును, ఆడవాళ్లకు మాత్రం నో ఎంట్రీ. ఫెస్టివల్‌ అంటున్నారు.. ఆడాళ్లకి ఎంట్రీ లేదంటున్నారు.. పండగంటేనే అంతా కలిసి చేసుకునేది కదా ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా? విడ్డూరం కాదు.. అది అక్కడి ఆచారం. ఇంతకీ ఈ ఫెస్టివల్‌ ఎక్కడో తెలుసా? తమిళనాడులో. మధురై జిల్లా తిరుమంగళంలో ఉన్న కరుప్పారై ముత్తయ్య ఆలయంలో ఈ జాతర నిర్వహిస్తారు. ఇప్పడు ఈ జాతర టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది ప్రతి ఏటా ఎంతో గ్రాండ్‌‌గా జరిగే ఈ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జాతరను కిడా విరుందు జాతర అంటారు. కిడా విరుందు అంటే మాంసాహార జాతర అని అర్థం. ఈ జాతరకు పురుషులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రతి సంవత్సరం మార్గళిమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. స్థానికులే కాకుండా, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా స్వామివారికి మొక్కుకుని మేకను పెంచుతారు. అలా పెంచిన మేకను ఆలయానికి సమర్పిస్తారు. అదికూడా కేవలం నల్ల మేకను మాత్రమే సమర్పించాలి. ఇక అలా ఆలయానికి వచ్చిన మేకలతో నాన్ వెజ్ విందు ఏర్పాటు చేస్తారు. ఈ నాన్ వెజ్ విందులో సుమారు 15 వేలమంది పురుషులు పాల్గొంటారు. ఈ జాతరకు ఎవరినీ ఎవరూ పిలవరు. ఎవరికి వారే వచ్చి జాతరలో పాల్గొంటారు. 100కు పైగా మేకలని స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎవరు ఎంత తింటే అంత వడ్డిస్తారు. అయితే ఈ జాతరకు కానీ, ఆలయంలోకి కానీ స్త్రీలకు మాత్రం ప్రవేశం ఉందదు. ఎందుకంటే అక్కడ విందు జరుగుతున్న సమయంలో పురుషులు భోజనం చేస్తుండగా స్త్రీలు చూడకూడదట. అలా చూస్తే అశుభం జరుగుతుందని వారి విశ్వాసం. విందు పూర్తి ఆయన తరువాత పురుషులు ఇస్తరులు తీయకుండా అక్కడనుండి వెళ్లిపోతారు. అవి పూర్తిగా ఎండిపోయే వరకు స్త్రీలు పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదు. ఇస్తరులు పూర్తి గా ఎండిపోయి కనుమరుగైన తరువాత మాత్రమే స్త్రీలకు ఆలయ ప్రవేశం ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా ?? ఈ విషయం తెలిస్తే ఆ పని చేయరు !!

అయ్యో పాపం.. అప్పట్లో హీరోయిన్‌కు అన్ని కష్టాలా

Payal Rajput: పాయల్‌కు ప్రొడ్యూసర్ వార్నింగ్ బ్యాన్ అస్త్రం

Sai Pallavi: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా

Follow us on