Dal Lake: వామ్మో ఇదేం చలి.! గడ్డ కట్టిన దాల్ సరస్సు.. ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు.

|

Jan 05, 2024 | 3:19 PM

భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని దాల్ సరస్సు పూర్తిగా గడ్డ కట్టుకుపోయింది. అది చూసి స్థానికులు, పర్యాటకులు తెగ మురిసిపోతున్నారు. గడ్డకట్టి నదిపై అటూ ఇటూ నడుస్తూ పర్యాటకులు..

భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని దాల్ సరస్సు పూర్తిగా గడ్డ కట్టుకుపోయింది. అది చూసి స్థానికులు, పర్యాటకులు తెగ మురిసిపోతున్నారు. గడ్డకట్టి నదిపై అటూ ఇటూ నడుస్తూ పర్యాటకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో తీవ్ర మైన చలి కారణంగా వారికి ఇబ్బందులు కూడా తప్పడం లేదు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో గల పహల్గామ్‌లో కూడా ఉష్ణోగ్రతలు మైనస్‌ 5.7 సెల్సియస్‌కు పడిపోయాయి. ఖాజిగుండ్‌లో మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్, కోకెర్‌నాగ్‌లో కనిష్టంగా మైనస్ 1.7 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా మైనస్ 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. మరో వైపు ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.