ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తాబేలు ఏం చేసిందో చూడండి !! నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తాబేలు ఏం చేసిందో చూడండి !! నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

Phani CH

|

Updated on: Sep 03, 2022 | 9:44 AM

కష్ట సమయంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం మనకు తెలిసిందే. కొన్ని సార్లు తెలిసిన వాళ్లు, బంధువులు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో స్నేహితులు తామున్నామంటూ భరోసా ఇస్తుంటారు.

కష్ట సమయంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం మనకు తెలిసిందే. కొన్ని సార్లు తెలిసిన వాళ్లు, బంధువులు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో స్నేహితులు తామున్నామంటూ భరోసా ఇస్తుంటారు. అందుకే అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం గొప్పది. ఫ్రెండ్ షిప్ అనేది మనిషి జీవితంలో గొప్ప వరం. ఇది పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. అడవిలో జంతువుల మధ్య ఉండే మైత్రి మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పెద్ద తాబేలు ఉల్టా పడిపోయింది. అది మళ్లీ మామూలు స్థితికి వచ్చేందుకు చాలా కష్టపడింది కానీ.. ఎన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ అది పూర్వస్థితికి రావడం కుదర లేదు. దాని అవస్థ గమనించిన మరో తాబేలు దానికి సాయం చేసింది. ఉల్టాపడిన తన మిత్రుడిని యధాస్థితికి తీసుకొచ్చింది. ఆ తర్వాత మిత్రులిద్దరూ కలిసి హ్యాపీగా తమ స్థావరాలకు వెళ్లిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన సోషల్‌మీడియాలో పోస్ట్‌ కావడంతో వైరల్‌గా మారింది. వీడియో చూస్తున్న వేలాదిమంది నెటిజన్లు ఆపదలో ఉన్న స్నేహితుడిని కాపాడిన తాబేలును నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టికెట్లు క్యాన్సిల్‌ చేసినా అదనంగా 5 శాతం జీఎస్టీ పే చేయాల్సిందే !!

భూమి తిరగడం ఎప్పుడైనా చూశారా.. అద్భుతమైన వీడియో

అందుకే విరాట్‌ Attitude నాకు నచ్చుతుంది

కోహ్లీ, పాండ్యాను కలిసిన ‘మారో ముఝే మారో’

Published on: Sep 03, 2022 09:44 AM