అన్నం పెడితే చాలు వాంతులు చేసుకుంటున్న చిన్నారి.. వైద్యులు టెస్టులు చేయగా

Updated on: Aug 18, 2025 | 6:22 PM

మధ్యప్రదేశ్‌ ఖాండ్వాలో ఏడాది వయస్సు ఉన్న బాలుడికి ఉన్నపలంగా వాంతులు స్టార్టయ్యాయి. అన్నం జీర్ణం అవ్వలేదేమో అని సిరప్ వేశారు. అయినా సరే వాంతులు ఆగకపోగా.. ఇంకాస్త ఎక్కువయ్యాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ చిన్నోడికి టెస్టులు చేసిన డాక్టర్లు బుడ్డోడి గొంతులో ఏదో చిన్నపాటి వస్తువు ఉండటాన్ని గుర్తించారు.

ఆ తర్వాత పరిశీలించగా అది LED లైట్‌ అని తేలింది. అది గొంతులో ఇరుక్కుపోవడంతో నిరంతరం వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో.. బాలుడికి వాంతులు ఎందుకు అవుతున్నాయో అర్థం కాలేదు. మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు త్వరగా చర్య తీసుకుని అతని గొంతు నుంచి LED బల్బ్‌ను తొలగించారు. చిన్నోడు కోలుకున్నాడని.. డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆ చిన్నారికి చికిత్స చేసిన రెసిడెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ.. ఎక్స్-రేలో గొంతులో ఏదో ఉన్నట్లు నిర్ధారించామని చెప్పారు. లేపరోస్కోపిక్ పద్దతిలో దాన్ని తొలగించినట్లు వివరించారు. ఆ బాలుడి తండ్రి మనీష్ పటేల్ మాట్లాడుతూ.. రాఖీలో LED లైటు అమర్చారని చెప్పారు. చిన్నారి రాఖీని నోట్లో పెట్టుకుంటూ దానిని మింగేసి ఉంటాడని తెలిపారు. తాము అతనికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారీ.. బాబు వాంతులు చేసుకున్నట్లు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు గొంతు నుంచి లైట్ తొలగించారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యాక, బాలుడిని కొన్ని రోజులు పరిశీలనలో ఉంచి డిశ్చార్జ్ చేశారు. అలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రి 7 గంటలలోపు భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

Gold Rate Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?

వణికించిన తుఫాను.. గంటకు 260 కి.మీ వేగంతో గాలులు