Loading video

హిమగిరిగా మారిన తిరుమల వీడియో

| Edited By: Ram Naramaneni

Mar 21, 2025 | 10:16 PM

తిరుమల గిరులు హిమగిరులను తలపిస్తున్నాయి. హోళీ వేళ తిరుమల గిరులు దవళవర్ణంలో మెరిసిపోయాయి. తిరుమల ఏడు కొండలను మంచు కమ్మేసింది. నింగిలోని మేఘాలు నేలపైకి వచ్చాయా అన్నట్టుగా తట్టమైన పొగమంచు పాలసముద్రాన్ని తలపించింది. రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంటోంది. ఓ వైపు ఎండలు ఉక్కపోత... మరోవైపు కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే ఇప్పడు తిరుమలను పొగమంచు కమ్మేసింది.

 ఈ విచిత్ర వాతావరణం తిరుమలకు వెళ్లే భక్తులకు వింత అనుభూతిని కలిగించింది. పొగ మంచు కప్పేసిన తిరుమల కొండల్లోని వాతావరణం భక్తులతో పాటు ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. తిరుమల ఘాట్ రోడ్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేలా అలముకున్న దట్టమైన పొగ మంచును చూసి భక్తులు కేరింతలు కొట్టారు. తిరుమల కొండపైనుంచి చూస్తే పొగమంచు తప్ప తిరుపతి నగరం కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి భక్తులు ఫోటో షూట్‌కు దిగారు. ఒకవైపు ఈ నెల మొదటి వారం నుంచి ఉదయం 10 గంటలకే ఎండలు దంచి కొడుతుంటే.. శుక్రవారం తిరుమల గిరులకు చేరే భక్తులకు కనిపించిన ఈ వెదర్ వారికి కొత్త అనుభూతిని మిగిల్చింది. ఈ నేపధ్యంలో వాహనాలు నిలిపివేసి మంచు అందాలను ఆస్వాదించారు. ఫోటోలు.. సెల్ఫీలు.. వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో

ఒక్క టూత్‌ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

Published on: Mar 21, 2025 09:08 AM