Bear in Tirumala: తిరుమల నడక మార్గాల్లో చిరుత సరే.. ఎలుగుబంటి ఏమైంది..?
తిరుమలలో కాలినడకన కొండపైకి వెళ్తున్న భక్తులు మెట్టు మెట్టుకూ భయంతో అడుగులు వేస్తున్నారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో బిక్కుబిక్కుమంటూ అడుగులో అడుగు వేస్తున్నారు. నల్లటి ఎలుగును చూడగానే.. భక్తులు పరుగులు పెడుతున్నారు. అది ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు గాలిస్తున్నా.. దాని జాడ మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
తిరుమలలో కాలినడకన కొండపైకి వెళ్తున్న భక్తులు మెట్టు మెట్టుకూ భయంతో అడుగులు వేస్తున్నారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో బిక్కుబిక్కుమంటూ అడుగులో అడుగు వేస్తున్నారు. నల్లటి ఎలుగును చూడగానే.. భక్తులు పరుగులు పెడుతున్నారు. అది ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు గాలిస్తున్నా.. దాని జాడ మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. చిరుత, ఎలుగుబంటి. ఈ రెండు బంధిస్తే నడక మార్గంలో ఆపరేషన్ క్లోజ్ అవుతుందని అటవీ అధికారులు భావించారు. అయితే ఎలుగుబంటి ఏమైందో మాత్రం ఇప్పటిదాకా చెప్పలేక పోతున్నారు. నాలుగు చిరుతలను పట్టిన అటవీ శాఖ ఎలుగుబంటిని మాత్రం పట్టలేకపోతోంది.
శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడకమార్గం రెండుచోట్ల హడావిడి చేస్తున్న ఎలుగుబంటిని బంధించడం ఇప్పుడు సవాలుగా మారింది. నాలుగు బోన్లను ఎలుగుబంటి ఆపరేషన్ కోసమే వినియోగిస్తున్న అటవీశాఖ 150 మంది సిబ్బందిని కూడా వినియోగిస్తోంది. అయితే తెలివిగా వ్యవహరిస్తున్న ఎలుగుబంటి సిబ్బంది కి దొరక్కుండా వలలో చిక్కకుండా రెండు నడక మార్గాల్లో సంచరిస్తూనే ఉంది. టీటీడీ తోపాటు అటవీ శాఖ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా.. ఎలుగుబంటిని బంధించడం గగనమవుతుంది. ట్రాప్ కెమెరాల్లోనే కనిపించడమే కాదు.. ఏకంగా భక్తుల ముందు దర్జాగా నడక మార్గం దాటుతున్నా దొరక్కుండా తప్పించుకుంటుంది. తిరుమల నడక మార్గాల్లో చిరుతల సంగతి ఓకే.. ఎలుగుబంటి మాటేమిటన్న ప్రశ్న ఇప్పుడు భక్తుల్లో భయం పుట్టిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..