Tiger: కారుచీకట్లో పెద్దపులి.. యూపీలోని చెరుకు తోటల్లో పులులు సాధారణమేనట.!

|

Oct 07, 2023 | 9:29 PM

ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురైంది. కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురైంది. కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ 17 సెకన్ల వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని తేరాయ్‌కు చెందింది. సోషల్ మీడియా వైరల్‌గా మారిన వీడియో నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. వాహనంలో నుండి చిత్రీకరించినట్లు గమనించవచ్చు. కారు బానెట్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్‌ ‘ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లా తేరాయ్‌లోని కొన్ని చెరకు పొలాల్లో పులులు సరదాగా తిరుగుతాయి. ఈ వీడియో కుక్రా ప్రాంతానికి చెందినది’ అని రాశారు. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ ఐఎఫ్‌ఎస్‌ అధికారి రమేష్ పాండే ..చెరకు పొలాలు అటు వేటగాళ్లకు, ఇటు వేటాడే క్రూర వృగాలకు ఇష్టమైన ప్రదేశమని అందుకే ఇటువంటి చోట్ల మనుషులు, క్రూరమృగాలు ఎదురుకావడం జరుగుతుంటుందని కామెంట్‌ చేసారు. శీతాకాలంలో ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయని అలాగే కారు హెడ్ లైట్ల కాంతి పెద్దపులిపై పడుతుండటం వీడియోలో కనిపిస్తుందని రాశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..