Thunder Live: పిడుగు పడుతుండగా లైవ్‌లో ఎప్పుడైనా చూసారా.. ఇప్పుడు చూడండి..

|

Jul 11, 2022 | 8:57 PM

తరచూ పిడుగులు పడడం చూస్తూంటాం. పిడుగు పడే ముందు మెరుపులతో కూడిన పెద్ద శబ్ధం వస్తుంది. పిడుగులు పడే సమయంలో ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి.


తరచూ పిడుగులు పడడం చూస్తూంటాం. పిడుగు పడే ముందు మెరుపులతో కూడిన పెద్ద శబ్ధం వస్తుంది. పిడుగులు పడే సమయంలో ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. తాజాగా పిడుగు పడుతున్న దృశ్యం ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వైరలవుతున్న ఈ వీడియోలో.. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. ఆశ్చర్యకరంగా ఆ షాకింగ్ ఘటనను అతని భార్య తన కెమెరాలో బంధించింది. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఎడ్వర్డ్ వాలెన్ అనే వ్యక్తి తన భార్య మిచెల్‌తో కలిసి వర్షాన్ని ఆస్వాదించడానికి విహారయాత్రకు వెళ్లాడు. మిచెల్ ఒక ట్రక్కులో ప్రయాణిస్తుండగా… అతని భార్య తన కారులో వెనకే వస్తుంది. ఆమె తన కెమెరాలో కుండపోత వర్షాన్ని రికార్డ్ చేసింది. అప్పుడప్పుడు తన భర్త ఫోటోలు కూడా తీసింది. ఆ సమయంలోనే ఆకాశం నుంచి మెరుపు వచ్చి నేరుగా ఆమె భర్తపై పడింది. ఈ షాకింగ్ ఘటనను ఆమె కెమెరాలో బంధించింది. ఈ భయానక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గాయపడిన ఎడ్వర్డ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీ అదృష్టం బాగుంది గురూ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 11, 2022 08:57 PM