Viral Video: దేశ రాజధానిలో రెచ్చిపోయిన దుండగులు.. నడిరోడ్డులో కారుపై కాల్పులు..! విజువల్స్ మాములుగా లేవు..
దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ కారుపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భయంతో జనం కకావికలమైపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో జరిగింది ఈ ఘటన.
దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ కారుపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భయంతో జనం కకావికలమైపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో జరిగింది ఈ ఘటన. దుండగుల ఈ దుశ్చర్యలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి శాంతి నగర్‌లో రోడ్లు రద్దీగా ఉన్నాయి. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా ఓ కారుపై కాల్పులు ప్రారంభించారు. దీంతో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. అనంతరం వారు అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, గాయపడినవారిని చికిత్సకు ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారు అజయ్ చౌదరి, జస్సా చౌదరిగా గుర్తించారు. మొత్తం పది రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాగా కాల్పులకు తెగబడినవారిని గుర్తించడానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని డీసీపీ ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు
130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది..

