Adilabad: పొలం పనుల్లో ఉండగా ఊహించని పరిణామం.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు

|

Sep 03, 2022 | 9:31 PM

పిడుగుపడి ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పిడుగుపాటుకు కొమురంభీం జిల్లాలో‌ ఇద్దరు యువకులు,

పిడుగుపడి ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పిడుగుపాటుకు కొమురంభీం జిల్లాలో‌ ఇద్దరు యువకులు, ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువ రైతు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కొమురంభీం జిల్లా లింగపూర్ మండలం గోపాల్ పూర్ లో జాదవ్ అజయ్ అనే యువకుడు పత్తి చేనులో పురుగుల మందు కొడుతుండగా పిడుగు పడి మృతి చెందాడు. ఇదే జిల్లా తిర్యాణి మండలం సుంగాపూర్ లో పత్తి చేనులో కలుపు తీస్తున్న సమయంలో తండ్రికొడుకులపై పిడుగు పడింది. కుమారుడు బొమ్మన శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి బొమ్మన లచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరో కొమురంభీం జిల్లా తుంపల్లిలో పిడుగుపాటుకు యువరైతుకు తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ కు చెందిన‌ యువ రైతు రాథోడ్ మనోజ్ కుమార్ పొలంపనుల్లో‌ ఉండగా పిడుగుపాటుకు గురై చేనులోనే మృతిచెందాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 03, 2022 09:31 PM