Girls stuck in society lift: లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు చిన్నారులు..! అరగంట సేపు నరకం అనుభవించిన పిల్లలు..

Updated on: Dec 07, 2022 | 9:47 AM

ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 20 అంతస్తుల అసోటెక్‌ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవ‌త్సరాల వ‌య‌స్సు ఉన్న ఆ చిన్నారులు


ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 20 అంతస్తుల అసోటెక్‌ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవ‌త్సరాల వ‌య‌స్సు ఉన్న ఆ చిన్నారులు అరగంట పాటు అందులోనే ఉండిపోయి నరకం అనుభవించారు. లిఫ్ట్ నుంచి ఎలా బయటపడాలో తెలియక అల్లాడిపోయారు ముగ్గురు అమ్మాయిలు. లిఫ్ట్‌ బటన్లు పనిచేయకపోవడంతో పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్‌షిప్‌లోని అసోటెక్ ది నెస్ట్‌లో న‌వంబ‌ర్ 29న ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఉండ‌గా స‌డెన్ ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ప్రయ‌త్నించినా ఓపెన్ కాలేదు. దీంతో సాయం కోసం చిన్నారులు గ‌ట్టిగా అరిచారు. అయితే ఫ‌లితం లేకుండా పోయింది. చివరికి పిల్లల ఆర్తనాదాలు విన్న స్థానికులు ముగ్గురిని రక్షించారు. ఈ ఘటనలో బిల్డర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లిఫ్ట్‌ రిపేర్‌ చేయాలని బిల్డర్‌కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని అపార్ట్‌మెంట్ వాసులు ఆరోపించారు. కాగా, ఇందుకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 07, 2022 09:47 AM