Kitchen Tip: ప్రస్తుత కాలంలో ఫ్రిడ్జ్ వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. టీవీ, ఫ్యాన్ ఎంత కామన్‌గా మారాయో ఫ్రిడ్జ్ కూడా అత్యవసర వస్తువుగా మారిపోయింది. మారుతోన్న అవసరాలకు అనుగుణంగా అందరూ రిఫ్రిజిరేటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఉపయోగించే సమయంలో బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత దుర్వాసన సమస్య వేధిస్తుంటుంది. దీంతో ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇతర ఆహార పదార్థాలకు ఈ వాసన వ్యాపిస్తుంది. అంతేకాకుండా రిఫ్రిజిరేటరల్లో ఎదురయ్యే మరో సమస్య మరకలు. ఫ్రిడ్జ్‌లో ఉండే వస్తువులను తీస్తూ, పెట్టే సమయంలో మరకలు అంటుకుంటుంటాయి. వీటిని తొలగించడం చాలా కష్టంతో కూడుకున్న పని.
అయితే ఒక చిన్న సింపుల్ టిప్‌ను ఫాలో అవ్వడం వల్ల ఫ్రిడ్జ్‌ను తళతళమని మెరిసేలా చేయడమే కాకుండా, దుర్వాసనకు కూడా చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఆ టిప్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ చిన్న పాయింట్ తెలియక ఇన్ని రోజులు రిఫ్రిజిరేటర్ క్లీనింగ్ కోసం ఇంతలా కష్టపడ్డామా.? అని అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఇంతకీ ఈ వీడియోలో రిఫ్రిజిరేట్ క్లీనింగ్‌కు సంబంధించి పేర్కొన్న టిప్ ఏంటనేగా…
ఇందుకోసం ముందుగా ఒక కప్ నీటిని తీసుకోవాలి. అనంతరం అందులో సగం కప్పు వైట్ వెనిగర్‌ను కలపాలి. అంతేకాకుండా 2 టీస్పూన్‌ల వెన్నిలా ఎక్స్ట్రాక్ట్‌ను యాడ్‌ను చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్‌లో ఉన్న వస్తువులన్నింటినీ బయటకు తీసి అంతకుముందు సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని స్ప్రే చేసి శుభ్రంగా క్లీన్ చేయాలి. అంతే ఫ్రిడ్జ్ తళతళమని మెరవడమే కాకుండా దుర్వాసనకు కూడా చెక్ పడుతుంది.
Bheemla Nayak: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భీమ్లానాయక్ ట్రైలర్ వచ్చేది అప్పుడే..