Viral Video: హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తూ.. రూ. 14 లక్షలు సంపాదించారు.. అసలు విషయం తెలిస్తే షాకే!(వీడియో)
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నెట్టింట ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. అవి చూస్తే ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యమేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే..
Viral Video: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నెట్టింట ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. అవి చూస్తే ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యమేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఓ జంట సరదాగా ఐలాండ్‌కు హాలిడేను ఎంజాయ్ చేయడానికి వెళ్లి ఏకంగా 14 లక్షలు సంపాదించారు. దీనికి వెనుక అసలు విషయం ఏంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు.ప్రపంచ మీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన హ్యారీ, బెక్కా అనే కపుల్‌కు.. ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే యాప్ ఓ ప్రాజెక్ట్ ఇచ్చింది. అదేంటంటే వీరిద్దరూ కలిపి ఓ ఐలాండ్‌లో సరదాగా ఎంజాయ్ చేయాలి. ఇంతేనా.. అని ఆశ్చర్యపోకండి. ఇందులో ఓ షరతు ఉంది. వీరిద్దరినీ సీసీ కెమెరాలు 24 గంటలు పర్యవేక్షిస్తుంటాయి. ఇక ఆ జంట తాము ఎంజాయ్ చేసిన బెస్ట్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సదరు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అంతే ఇంకేముంది లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చిపడ్డాయి. ఇది అసలే సోషల్ మీడియా యుగం. ఎక్కువ వ్యూస్, లైక్స్ వస్తే.. డబ్బు దానంతట అదే వస్తుంది. ఒక్క నెలలోనే ఈ జంట ఏకంగా 14,000 పౌండ్లు.. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 14 లక్షలు సంపాదించింది. తాము ఎలా డబ్బు సంపాదించామన్న దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదని బెక్కా స్పష్టం చేసింది. తమకు వచ్చిన డబ్బు ద్వారా తాము ఇప్పుడు హైక్లాస్ లైఫ్ స్టైల్‌ను ఎంజాయ్ చేస్తున్నామని ఆమె వివరించింది..