Man caught anaconda in water: పాములంటే భయపడని వారెవరుంటారు చెప్పండి. అనకొండ (anaconda)సినిమాలో అంత పెద్ద పామును చూస్తేనే గుండె కాయ గొంతులోకొచ్చినంత పనౌతుంది. అటువంటిది రియల్ లైఫ్‌లో అనుకోకుండా అనకొండ ఎదురుపడితే.. ఇక అంతే సంగతులు. హార్ట్ ఎటాక్ రావొచ్చు..ఏమైనా జరగొచ్చు కదా! కానీ.. ఇతనికి పాములను పట్టుకోవడం మహా సరదాలా ఉంది. నీళ్లలో దానిమానాన అది పోతుంతే వెంటపడి మరీ పట్టుకున్నాడు. ఏదో చిన్న పాము పిల్ల అని అనుకునేరు. ఇప్పటి వరకు చర్చించామే.. అనకొండ సైజులో ఉన్న భారీ పాము అది. నమ్మబుద్ధి కావట్టేదా! ఐతే ఈ వీడియో (viral video) వైపు మీరూ ఓ లుక్కెయ్యండి..
ఈ వీడియోలో ఓ వ్యక్తి నీళ్లలో పడవపై నిలబడి అటుగా వెళ్తున్న భారీ సైజులో ఉన్న అనకొండ తోక పట్టుకున్నాడు. అదేమో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి అతను తోకను విడిచిపెట్టడంతో.. బతుకు జీవుడా అని నీళ్లలో ఈదు కుంటూ దూరంగా వెళ్లడం కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం వేలల్లోకామెంట్లు పెట్టేస్తున్నారు. అనకొండతో ఆటలాడటం ప్రమాదకరమని పిల్లలకు కూడా తెలుసు.. ఆ మాత్రం నీకు తెలియదా? అని ఒకరు, అసాధారణ జంతువుతో ఆటలని మరొకరు, నీకు భూమిపై నూకలింకా మిగిలే ఉన్నాయని ఇంకొకరు కామెంట్లు పంపారు. కెమేరాలకు చిక్కిన అనకొండ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ నెట్టింట మళ్లీ వైరల్ అవ్వడంతో వార్తల్లో నిలిచింది.
ఐతే ఇది నిజమా కాదా అనే విషయంలో కొంత అనుమానం కూడా లేకపోలేదు.
Also Read: