ఆదర్శ దంపతులు.. ఇది కదా భార్యభర్తల బంధం అంటే..
ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి విలువ తగ్గిపోతుందనిపిస్తోంది. కష్టసుఖాలను తట్టుకుంటూ జీవితాంతం కలిసి నడుస్తామని ప్రమాణం చేసి ఏడడుగులు నడిచిన దంపతులు.. చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు.
ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి విలువ తగ్గిపోతుందనిపిస్తోంది. కష్టసుఖాలను తట్టుకుంటూ జీవితాంతం కలిసి నడుస్తామని ప్రమాణం చేసి ఏడడుగులు నడిచిన దంపతులు.. చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు. ఈ క్రమంలో వివాహ బంధానికి సరైన అర్థం చాటిచెబుతున్నారు ఓ వృద్ధ దంపతులు. వారి అన్యోన్యతకు నెటిజన్లు ముగ్దులైపోతున్నారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి డాక్టర్ సుమితా మిశ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో చూసిన ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వృద్ధ జంట మధ్య తరగని ప్రేమ, అప్యాయత కనిపిస్తుంది. ఈ వీడియోలో వృద్ధదంపతులు నేలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇందులో ఆ వృద్ధుడికి ఏ మాత్రం ఓపిక లేదు.. తన చేతులతో స్వయంగా ఆహారం కూడా తినలేకపోతున్నాడు..దాంతో ఆ వృద్ధురాలు అమ్మలా తానే అతడికి ఆహారం తినిపిస్తుంది. పసి పిల్లాడికి బువ్వ తినిపించినట్టుగా తన భర్తకు ఎంతో ప్రేమగా తినిపిస్తూ నెటిజన్లను కట్టిపడేసింది. ఈ వీడియో చూసి లక్షలమంది ఇంప్రెస్ అయ్యారు. విపరీతంగా లైక్ చేస్తూ షేర్ చేశారు. వందలాది మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా నిజమైన ప్రేమంటే.. ఆదర్శ దంపతులకు నిలువెత్తు నిదర్శనం అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: కుక్కను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ కష్టాలు..
సైలెంట్‌గా వెళ్లి గుడ్డును గుటుక్కున మింగింది.. ఆ తర్వాత దాని తిప్పలు చూడండి
అడవిలో సఫారికి వెళ్ళిన పర్యాటకులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం
Digital TOP 9 NEWS: పదం పలకలేదని విద్యార్థిని కొట్టి చంపిన టీచర్! || రెండు విమానాల క్రాష్
TOP 9 ET News: రక్తాన్ని దారపోసి చేస్తున్నా.. ప్లీజ్ ఇలాంటివి వద్దు || ‘నజబాజ’ తో గాడ్ ఫాదర్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

