సైలెంట్‌గా వెళ్లి గుడ్డును గుటుక్కున మింగింది.. ఆ తర్వాత దాని తిప్పలు చూడండి
పాము అంటే.. చాలామందికి భయం.. అయితే పాములకు సంబంధించిన వీడియోలు మాత్రం చాలామంది చూస్తారు. స్నేక్స్‌కి సంబంధించిన రకరకాల వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
పాము అంటే.. చాలామందికి భయం.. అయితే పాములకు సంబంధించిన వీడియోలు మాత్రం చాలామంది చూస్తారు. స్నేక్స్‌కి సంబంధించిన రకరకాల వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక్కడ పాముకు పెద్ద సమస్య ఎదురొచ్చింది. సైలెంట్‌గా నక్కుతూ.. ఓ ట్రేకి ఉన్న కన్నం గుండా వెళ్లి ఒక గుడ్డును మింగింది. అయితే అంతవరకు బానే ఉంది. గుడ్డు మింగిన తర్వాత దాని శరీరం.. ఉబ్బిపోయి.. బయటకు రాకుండా స్ట్రక్ అయిపోయింది. దీంతో పాము ముందుకు వెళ్లలేక.. వెనక్కి తగ్గలేక సతమతమయ్యింది. చివరికి చేసేదేం లేక.. ఆ గుడ్డును బయటకి కక్కేసింది. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. పాపం పామును చూస్తే జాలేస్తుంది అని మరో యూజర్ అంటే… ఆ గుడ్డులోని పిల్లకి ఏదో వరం ఉన్నట్లుంది అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తానికి ఈ వీడియోను నెటిజన్లు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవిలో సఫారికి వెళ్ళిన పర్యాటకులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం
Digital TOP 9 NEWS: పదం పలకలేదని విద్యార్థిని కొట్టి చంపిన టీచర్! || రెండు విమానాల క్రాష్
TOP 9 ET News: రక్తాన్ని దారపోసి చేస్తున్నా.. ప్లీజ్ ఇలాంటివి వద్దు || ‘నజబాజ’ తో గాడ్ ఫాదర్
Digital News Round Up: ప్రభాస్ పిక్ లీక్ అవడంపై ప్రశాంత్ నీల్ సీరియస్ వార్నింగ్ ..లైవ్ వీడియో
Big News Big Debate: విభజన చట్టంలో హామీల అమలుకు దారేది ?? లైవ్ వీడియో
తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం
ఎవడ్రా వీడు.. మటన్ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..
బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !

