మసీదులో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్య పోతారు !!

|

Jan 10, 2023 | 9:25 AM

దోచేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు గుళ్లు, మసీదులను వదలడంలేదు కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని మసీదుల్లో దొంగలు పడ్డారు.

దోచేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు గుళ్లు, మసీదులను వదలడంలేదు కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని మసీదుల్లో దొంగలు పడ్డారు. నిన్న మొన్నటి వరకు మసీదులోని చెప్పులు, సెల్‌ఫోన్లు, లైట్లు దొంగతనం చేసిన దొంగలు.. ఇప్పుడు ఏకంగా కుళాయిలు ఎత్తుకెళ్లిపోయారు. ప్రార్థనలు కోసం వచ్చిన భక్తులు వాజు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన నల్లాలను సైతం వదలడం లేదు. ఉదయం నమాజు సమయంలో నల్లా పీకేసినట్టు కనిపించిన దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. దీంతో సీసీ కెమెరాలను పరిశించగా.. ఓ దొంగ నల్లాలు తీసుకెళుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు జామియా మసీదు ప్రతినిధులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటిపై బట్టలు లేకున్నా.. అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు

క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్న కోతి.. శివునికి మొక్కుతూ..

హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేసిన వ్యక్తి.. ప్లేట్‌లో కనిపించింది చూసి షాక్‌..

ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక వరుడి పరిస్థితికి జాలిపడుతున్న నెటిజన్లు..

Published on: Jan 10, 2023 09:25 AM