వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీస్ స్టేషన్ గోడకు కన్నం పెట్టి మద్యం చోరీ
ఎవరి ఇంట్లోనైనా దొంగలు పడితే పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీస్ స్టేషన్‌లోనే దొంగలు పడితే..? అవును పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు. ఇదేంటి పోలీస్ స్టేషన్‌లో ఏముంటుంది దోచుకెళ్లడానికి అనుకుంటున్నారా? అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక దొంగ తన స్నేహతుడైన మరో దొంగను వెంటపెట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్ గోడకే కన్నంపెట్టి మరీ మందుబాటిళ్లను ఎత్తుకెళ్లిపోయారు.
ఎవరి ఇంట్లోనైనా దొంగలు పడితే పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీస్ స్టేషన్‌లోనే దొంగలు పడితే..? అవును పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు. ఇదేంటి పోలీస్ స్టేషన్‌లో ఏముంటుంది దోచుకెళ్లడానికి అనుకుంటున్నారా? అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక దొంగ తన స్నేహతుడైన మరో దొంగను వెంటపెట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్ గోడకే కన్నంపెట్టి మరీ మందుబాటిళ్లను ఎత్తుకెళ్లిపోయారు. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో సెప్టెంబర్ 22 రాత్రి జరిగింది. బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నా కొన్ని చోట్ల మద్యం అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. దీంతో పోలీసులు తనిఖీలు చేసి భారీ మొత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 22 రాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా స్టేషన్‌లో విధుల్లో ఉన్న పోలీసులందరూ ఒకే చోటకు చేరారు. ఇదే అదనుగా భావించిన దొంగలు పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న స్టోర్ రూం గోడ పగులగొట్టి ఐదు బాక్సులు, బ్యాగ్ నిండా మద్యం సీసాలు ఎత్తుకెళ్లిపోయారు. మర్నాడు స్టోర్ రూంలో భద్రపరచిన మద్యం సీసాలు కనిపించకపోవడం, గోడకి కన్నం అన్నీ చూసి షాకయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.2వేల నోటు మార్పిడికి మరో 5 రోజులే గడువు..
బాహుబలి విమానం వచ్చేసింది.. ఇక శత్రువులకు గుండెదడే !!
రోగులకు చేతబడి చేశారంటూ క్షుద్రపూజలు చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు !! చివరికి ??
Navdeep: నవదీప్ గుట్టంతా ఆ మొబైల్ ఫోన్‌లోనే !! ఫోన్ తెరిస్తే హీరో పని ఔట్.
Elon Musk: ఎలాన్ మస్క్ మంత్రమేశాడు.. రోబో యోగా చేస్తోంది
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

