ATMs Looted: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లిపోయారుగా.. వీడియో వైరల్.

ATMs Looted: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లిపోయారుగా.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Feb 02, 2023 | 6:49 PM

రాజస్థాన్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఏటీఎంలో చోరీకి వెళ్లిన దొంగలు ఏకంగా మెషిన్‌నే లేపేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌ పట్టణంలో జరిగింది. పట్టణంలోని రెండు ఏటీఎం కేంద్రాల్లోని చోరీకి వెళ్లారు.


రాజస్థాన్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఏటీఎంలో చోరీకి వెళ్లిన దొంగలు ఏకంగా మెషిన్‌నే లేపేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌ పట్టణంలో జరిగింది. పట్టణంలోని రెండు ఏటీఎం కేంద్రాల్లోని చోరీకి వెళ్లారు. ఈ క్రమంలో వారు ఏకంగా మెషిన్‌లను గునపాలతో పెకలించుకొని తీసుకెళ్లిపోయి భారీగా నగదు లూటీ చేశారు. ఆరెయిన్‌ ఏరియానుంచి ఎత్తుకెళ్లిన మెషిన్‌లో 8 లక్షల రూపాయలు, రూపన్‌గఢ్‌ ఏరియా నుంచి ఎత్తుకెళ్లిన ఏటీఎం మెషిన్‌లో 30 లక్షల రూపాయలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు దొంగలు ఆ రెండు ఏటీఎం కేంద్రాల్లో చొరబడి ఏటీఎం మెషిన్‌లను పెకిలించిన తీరు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రెండు ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు ఒకేలా జరగడంతో అది ఒకే దొంగల ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Feb 02, 2023 06:49 PM