Mumbai to Europe: ఫారిన్ అమ్మాయిని పడేశాడు.. దెబ్బకు జాక్‌పాట్‌ కొట్టాడు.. పెళ్లి తర్వాత బెలారస్‌లో.. వీడియో.

Mumbai to Europe: ఫారిన్ అమ్మాయిని పడేశాడు.. దెబ్బకు జాక్‌పాట్‌ కొట్టాడు.. పెళ్లి తర్వాత బెలారస్‌లో.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 02, 2023 | 6:54 PM

ప్రేమకు సరిహద్దులు, ఎల్లలు, కులం, మతం, వర్ణం అన్నీ అతీతమే. సరిగ్గా ఇదే నిదర్శనంతో ఈ మధ్యకాలంలో విదేశీ అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భారతీయ అబ్బాయిలు.



ప్రేమకు సరిహద్దులు, ఎల్లలు, కులం, మతం, వర్ణం అన్నీ అతీతమే. సరిగ్గా ఇదే నిదర్శనంతో ఈ మధ్యకాలంలో విదేశీ అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భారతీయ అబ్బాయిలు. వీరిలో కొందరు తమ విదేశీ భార్యలతో భారతదేశంలో స్థిరపడితే, మరికొందరు విదేశాలలో సెటిల్ అవుతున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తి మిథిలేష్. ముంబైకి చెందిన ఈ ట్రావెల్ బ్లాగర్ ఇటీవల ఓ విదేశీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ వివాహమే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయింది.బెలారస్‌కు చెందిన లిసా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న మిథిలేష్.. పెళ్లి తర్వాత బెలారస్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు లిసా, మిథిలేష్‌లు తల్లిదండ్రులు అయ్యారు. లిసా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, బిడ్డ పుట్టుక నుంచి వారి పెంపకం వరకు బెలారస్ ప్రభుత్వం తల్లిదండ్రులకు కొంత డబ్బు సాయాన్ని చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే.. మిథిలేష్ తన బిడ్డ పెంపెకం విషయంలో పెద్ద టెన్షన్‌ పడక్కర్లేదన్నమాట. తండ్రిగా మిథిలేష్‌ ప్రభుత్వం నుంచి మొదట లక్షా 28 వేల రూపాయలు పొందుతాడు. ఆ తర్వాత ప్రతీ నెలా 18 వేలు చొప్పున మూడేళ్ల పాటు లభిస్తాయి. ఈ డబ్బు నెల అయ్యేసరికి అతడి ఖాతాలోకి బదిలీ అవుతుంది. అయితే ఇక్కడొక కండీషన్ ఉంది.. ఆ భార్యాభర్తలు ఇద్దరూ బెలారస్‌లో నివాసం ఉండాలి. ఎలాగూ మిథిలేష్‌ భార్యతోపాటు బెలారస్‌లోనే ఉంటున్నాడు కాబట్టి ప్రాబ్లమే లేదు. కాగా, మిథిలేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు. అందులో అతడి భార్య లిసా పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని.. వారి బిడ్డ సుమారు 4 కిలోలు ఉందని తెలిపాడు. ఇప్పుడు ఆ చిన్నారికి రెండు నెలలు వయస్సట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Feb 02, 2023 06:54 PM