Diamond Spectals Video: భారత మొఘల్ రాజుల వజ్రవైఢూర్యాల కళ్లద్దాలివి.! దీని విలువ వేలానికి..(వీడియో)
లండన్‌లోని సొతెబీ వేలం సంస్థ నిర్వహించిన ఆక్షన్‌లో.. వినూత్న అద్దాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌ను ఏలిన 17వ శతాబ్దం నాటి మొఘలుల కళ్లద్దాలను వేలంలో ఉంచారు నిర్వహాకులు. అయితే ఈ కళ్ల జోడులో...
లండన్‌లోని సొతెబీ వేలం సంస్థ నిర్వహించిన ఆక్షన్‌లో.. వినూత్న అద్దాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌ను ఏలిన 17వ శతాబ్దం నాటి మొఘలుల కళ్లద్దాలను వేలంలో ఉంచారు నిర్వహాకులు. అయితే ఈ కళ్ల జోడులో 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల ఎమరాల్డ్స్ వంటి వాటితో ఈ అద్దాలను తయారు అయ్యాయి. దీంతో ఈ గాగుల్స్‌ను కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఔత్సాహికులు.
దాదాపు 50 ఏళ్ల పాటు ఆ కళ్లజోడును ఓ వ్యక్తి వద్దే ఉన్నాయని సంస్థ అంటోంది. 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల ఎమరాల్డ్స్ తో ఈ అద్దాలను తయారు చేశారని చెప్పింది. అయితే అవి ఏ యువరాజు చేయించారో.. వాటి రూపశిల్పి ఎవరన్నది మాత్రం తెలియదని సంస్థ పేర్కొంది. కాగా, వేలానికి ముందు ప్రజల సందర్శనార్థం తొలిసారి ఈ నెల 7 నుంచి 11 వరకు హాంకాంగ్ లో ప్రదర్శించింది. ఇక తాజాగా లండన్‌లో ప్రదర్శిస్తోంది. అక్టోబర్ 26 వరకు ఆ ప్రదర్శన జరగనుంది. ఆ తర్వత మర్నాడే వేలం నిర్వహించనుంది. ఒక్కో దానికి సుమారు రూ.15.5 కోట్ల నుంచి రూ.25.8 కోట్ల దాకా వస్తుందని అంచనా వేస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..