Devil Prank: దెయ్యంలా ప్రాంక్ చేయాలనుకుని ప్రాణాలు పోగొట్టుకుంది..! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
ప్రాంక్స్ ఈ మధ్య హద్దుమీరుతున్నాయి. పైత్యం ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా దెయ్యం మాదిరి గెటప్ వేసి.. ప్రాంక్ చేయబోయిన ఓ యువతి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది.
ప్రాంక్స్ ఈ మధ్య హద్దుమీరుతున్నాయి. పైత్యం ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా దెయ్యం మాదిరి గెటప్ వేసి.. ప్రాంక్ చేయబోయిన ఓ యువతి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. సదరు యువతి తెల్లటి దుస్తులు ధరించి భయానకమైన మేకప్‌తో వీధుల్లో తిరిగింది. ఆమెను చూసి చాలామంది భయపడ్డారు. కానీ ఓ వ్యక్తి మాత్రం భయంతో యువతిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటన మెక్సికోలోని నౌక్‌చాట్ డి జుయారజ్‌లో జరిగింది. చనిపోయిన యువతి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఆ మహిళ లాటిన్ అమెరికాలోని ‘లా లొరోనా’ అని పిలువబడే ఓ భయానక పాత్రలోలాగ మేకప్ వేసుకుంది. చనిపోయిన బిడ్డల కోసం రోధిస్తున్న మహళలా రోడ్లపై వచ్చిపోయేవారిని భయపెట్టింది. ‘ఏయ్ మిస్ హిజోస్’ అంటే ‘ఓ మై చిల్డ్రన్’ అని గట్టిగా అరుస్తూ ఆమె అక్టోబర్ 15న వీధుల్లో తిరిగిందని స్థానికులు తెలిపారు. సదరు మహిళకు సంబంధించిన విజువల్స్ కూడా కొందరు రికార్డ్ చేశారు. ఆమెను చూసిన భయపడిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.. తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంతవరకూ ఎలాంటి అరెస్టులు చేయలేదు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. చిన్న సరదా ఎంత పెద్ద పని చేసిందో చూడండి.. అందుకే అతి ఎప్పుడూ ప్రమాదకరమే అని పెద్దలు అంటారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

