కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను తెచ్చే పనిలో ఏపీ డిప్యూటీ సీఎం !! వీటి ప్రత్యేకత ఇదే !!

కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను తెచ్చే పనిలో ఏపీ డిప్యూటీ సీఎం !! వీటి ప్రత్యేకత ఇదే !!

Phani CH

|

Updated on: Aug 11, 2024 | 12:20 PM

ఇటీవల కాలంలో ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పంట పొలాల మీద గుంపులుగా దాడిచేసి నానా బీభత్సం చేస్తున్నాయి. అడ్డువచ్చిన అమాయకులపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో జనాలు ఏనుగులను చూసి భయంతో పారిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు, పార్వతిపురంలో ఏనుగులు నానారచ్చ చేస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా ఊళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకు చెక్ పెట్టేందుకు కుంకీ ఏనుగులు అవసరమని అధికారులు గుర్తించారు.

ఇటీవల కాలంలో ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పంట పొలాల మీద గుంపులుగా దాడిచేసి నానా బీభత్సం చేస్తున్నాయి. అడ్డువచ్చిన అమాయకులపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో జనాలు ఏనుగులను చూసి భయంతో పారిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు, పార్వతిపురంలో ఏనుగులు నానారచ్చ చేస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా ఊళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకు చెక్ పెట్టేందుకు కుంకీ ఏనుగులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో కర్నాటకలో ఉండే ఈ ప్రత్యేక ఏనుగులను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అసలు కుంకీ ఏనుగులు అంటే ఏమిటీ, వీటికి అంత ప్రత్యేకత ఏమిటి? వీటికి ఎందుకంత డిమాండ్ అనే చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది. కొన్ని ఏనుగులను మావటివాళ్లు మచ్చిక చేసుకుని పెంచుకుంటారు. వాటికి సంతానం కల్గినప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వీటికి ప్రత్యేకమైన ఆహారం పెడతారు. ఇతర ఏనుగుల్లా కాకుండా వీటిని ప్రత్యేకంగా ట్రైన్ చేస్తారు. దీంతో ఇవి బలిష్టంగా తయారౌతాయి. ఇవి తమ మావటి వాళ్లు చెప్పింది.. తూచా తప్పకుండా పాటిస్తాయి. ఇవి పెరిగి పెద్దవయ్యాక.. వీటిని గ్రామాల్లో ప్రవేశించిన అడవి ఏనుగుల్ని ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి గురించి శోభిత ఏం చెప్పిందో తెలుసా ??

సొంతూరిలో.. విద్యార్థులకు అండగా.. నాగ్ అశ్విన్ గొప్ప పని

వయనాడ్ బాధితులకు అండగా ఖైదీ.. జైలు నుంచి 15 కోట్ల సాయం

నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడని భయమేసింది..

నాని ఆగయా.. ఇక షో అదిరిపోతుంది అంతే..!