World Largest Apartment: ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!

|

Oct 12, 2024 | 8:18 PM

‘రీజెంట్ ఇంటర్నేషనల్‌’.. ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్. చైనాలోని కియాన్‌జియాంగ్‌ సెంచురీ నగరంలో ఉంది. 675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం చైనాలోనే అద్భుత కట్టడంగా నిలుస్తోంది. 39 అంతస్తులతో ‘ఎస్‌’ ఆకారంలో ఉన్న ఈ అతిపెద్ద భనవనం 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. గరిష్ఠంగా 30 వేల మంది నివసించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు.

ఇంత భారీ నివాసమైనప్పటికీ వసతులకు మాత్రం ఎటువంటి కొదవ లేదట. ఎలాంటి అవసరం వచ్చినా ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాల్సిన పనిలేదు. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, వినోద కార్యక్రమాలు.. ఇలా సకల సౌకర్యాలు అందులోనే ఉన్నాయి. ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఫుడ్‌ కోర్టులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, నిత్యవసర దుకాణాలు, సెలూన్లతోపాటు ఎంతో ఆహ్లాదకరమైన పార్కులు కూడా ఉండటం విశేషం. ఇప్పటికే ఈ భవనంలో 20 వేల మంది నివాసం ఉంటుండగా.. మరో 10 వేల మందికి సరిపడా ఏర్పాట్లు ఉన్నాయట. విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకు అద్దె ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. రీజెంట్ ఇంటర్నేషనల్‌ పేరుతో ఉన్న ఈ భవనం 2013లోనే ప్రారంభమైనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది ఒకేచోట నివసించే విధంగా చేపట్టిన ఈ అత్యాధునిక భవన నిర్మాణం అద్భుతమని, ఆర్కిటెక్టుల ప్రతిభకు నిదర్శనమంటూ పలువురు యూజర్లు స్పందిస్తున్నారు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదని కొందరు పేర్కొన్నారు. అయితే, భూకంపాల సమయంలో ఏమైనా ప్రమాదం జరిగితే రెస్క్యూ సిబ్బందికి సవాలేనని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 12, 2024 08:17 PM