Birth in Train: కదులుతున్న రైల్లో ప్రసవం..! సడన్ గా రైలును ఆపిన అధికారులు.! వీడియో
వేగంగా ప్రయాణిస్తున్న రైలులో ప్రయాణిస్తున్న ఓ నిండు గర్భిణీకి హఠాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఎక్కడా హాల్ట్ లేదు. ఆమె వెంట ఉన్న వాళ్లకి ఏం చెయ్యాలో పాలుపోక సహాయం కోసం అందరినీ అడుగుతున్నారు. మరో వైపు ఆమెకు పురిటినొప్పులు తీవ్రమవుతున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఆమె భర్త రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హాల్ట్ లేకపోయినా రైల్వే అధికారులు రైలును దగ్గరలోని రైల్వే స్టేషన్‌లో ఆపారు.
వేగంగా ప్రయాణిస్తున్న రైలులో ప్రయాణిస్తున్న ఓ నిండు గర్భిణీకి హఠాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఎక్కడా హాల్ట్ లేదు. ఆమె వెంట ఉన్న వాళ్లకి ఏం చెయ్యాలో పాలుపోక సహాయం కోసం అందరినీ అడుగుతున్నారు. మరో వైపు ఆమెకు పురిటినొప్పులు తీవ్రమవుతున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఆమె భర్త రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హాల్ట్ లేకపోయినా రైల్వే అధికారులు రైలును దగ్గరలోని రైల్వే స్టేషన్‌లో ఆపారు. అప్పటికే గర్భిణీ పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. తల్లి బిడ్డల ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. సినిమాటిక్ గా సాగిన ఈ ఘటన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో జరిగింది. సుశాంత, రశ్మిత అనే దంపతులు ఎర్నాకులం నుంచి హతియా వెళ్లే దర్తి అబ్బా ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తున్నారు. వారు బాలంగిరి వెళ్లేందుకు కోయంబత్తూర్ లో ట్రైన్ ఎక్కారు. రష్మిత ఏడు నెలలు గర్భిణి. ఆమెను డెలివరీ కోసం ఆమె భర్త సుశాంత పుట్టింటికి తీసుకు వెళుతున్నాడు. ఊహించని విధంగా ట్రైన్ లోనే రష్మితకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. కంగారు పడిన ఆమె భర్త సుశాంత వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారాన్ని చేరవేశాడు. అప్పటికి రైలు తాడేపల్లిగూడెం సమీపానికి చేరుకుంటోంది. కానీ తాడేపల్లిగూడెంలో ట్రైన్ ఆపడానికి హాల్టు లేదు. దాంతో సిబ్బంది రైల్వే ఉన్నత అధికారులను సంప్రదించి ట్రైన్ తాడేపల్లిగూడెం స్టేషన్లో ఆగేందుకు అనుమతి తీసుకున్నారు. అదే క్రమంలో రైల్వే టి సి 108కు సమాచారం ఇచ్చారు. ట్రైన్ తాడేపల్లిగూడెం స్టేషన్ వద్ద ఆగే సమయానికి 108 అంబులెన్స్ సిబ్బంది స్ట్రక్చర్ తో రెడీగా ఉన్నారు. ఈ లోపే రశ్మిత ట్రైన్లోనే మగ బిడ్డను ప్రసవించింది. దాంతో 108 సిబ్బంది ట్రైన్ ఆగిన వెంటనే భోగి లోనే ఆమెకు ప్రధమ చికిత్స చేశారు. అంబులెన్స్ లో వారిని ఎక్కించి అక్కడ నుంచి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు సుశాంత తెలిపారు. ట్రైన్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ విషయంలో రైల్వే అధికారులు చూపిన చొరవకు, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారికి వైద్య చికిత్సలు అందించిన 108 అంబులెన్స్ సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..