Tirumala: తిరుమల గిరుల్లో అద్భుతం.. ఆకాశం నేలకు దిగి వచ్చిందా అన్నట్లు ప్రకృతి పరవశం..

|

Nov 23, 2021 | 12:53 PM

Tirumala: తిరుమల ప్రకృతి పరవశానికి పెట్టింది పేరు. ఆ దేవదేవుడి కొలువైన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు. అన్నమయ్య కీర్తించినట్లు తిరమల కొండల్లో ప్రతీ అణువే ఓ అద్భుతమే.. చెట్టు, పుట్ట ఇలా ఏది చూసినా..

Tirumala: తిరుమల గిరుల్లో అద్భుతం.. ఆకాశం నేలకు దిగి వచ్చిందా అన్నట్లు ప్రకృతి పరవశం..
Tirumala Viral Video
Follow us on

Tirumala: తిరుమల ప్రకృతి పరవశానికి పెట్టింది పేరు. ఆ దేవదేవుడి కొలువైన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు. అన్నమయ్య కీర్తించినట్లు తిరమల కొండల్లో ప్రతీ అణువే ఓ అద్భుతమే.. చెట్టు, పుట్ట ఇలా ఏది చూసినా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరులా అనిపిస్తుంటుంది. ఇలా ఎన్నో అద్భుతాలకు నెలవైన తిరుమల్లో తాజాగా కనిపించిన ఓ దృశ్యం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. రెండో ఘాట్‌ రోడ్డు చివరి మలుపులో వద్ద ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశం నేలకు దిగి వచ్చిందా.? మేఘాలు చేతికి అందుతాయా.? అన్నంతలా ప్రకృతి రమణీయత ఆకట్టుకుంది. దీంతో అటుగా వెళుతోన్న యాత్రికులు వాహనాలు ఆపి మరీ ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తిరుమల గిరుల రమణీయతను వర్ణిస్తూ నెటిజన్లు వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా తిరుపతితో పాటు, తిరుమలలో కూడా అతాలకుతలమైన విషయం తెలిసిందే. అయితే టీటీడీ యుద్ధప్రాతిపాదిక చర్యలు చేపట్టడంతో పరిస్థితుల మళ్లీ మునపటి స్థితికి చేరుకున్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా శ్రీవారిని దర్శించుకోలేకపోయిన వారికి టీటీడీ మంచి అవకాశాన్ని కలిపించిన విషయం తెలిసిందే. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు టికెట్లు కలిగిన భక్తులు.. తమ దర్శన టికెట్లు మార్చుకునే వెసులుబాటు కల్పించింది.

టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన తేదీలను మార్చుకోవడంతో పాటు.. కొత్త టికెట్లను పొందే అవకాశాన్ని ఇచ్చింది. ఆరు నెలల్లోపు ఎప్పుడైనా పాత దర్శనం టికెట్లతో.. నూతన టికెట్లు పొందవచ్చని స్పష్టం చేసింది. ఇక రెండు ఘూట్‌ రోడ్లపై వాహనాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టూ వీలర్స్‌కి కూడా అనుమతి ఇచ్చారు.

Also Read: Col Santhosh Babu: దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు

Railway News: రైల్వే ప్యాసింజర్ అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

Mudragada Padmanabham: మీ వల్ల ఎన్నో నిద్దుర లేని రాత్రులు గడిపాం.. చంద్రబాబుకు ముద్రగడ సంచలన లేఖ