Cheetah Cubs: కునో నేషనల్‌ పార్క్‌లో చిరుత కూనల సందడి.! 3 కూనలకు జన్మనిచ్చిన జ్వాల

Updated on: Jan 24, 2024 | 6:23 PM

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో చీతాల సంఖ్య పెరుగుతోంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా.. జ్వాల తాజాగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేంధ్ర యాదవ్‌ పేర్కొన్నారు. రెండు వారాల క్రితమే ఆశ అనే మరో చీతా రెండు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కునో పార్క్‌లో చీతాల సంఖ్య పెరుగుతుండటంతో జంతుప్రేమికులు, పార్క్‌ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో చీతాల సంఖ్య పెరుగుతోంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా.. జ్వాల తాజాగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేంధ్ర యాదవ్‌ పేర్కొన్నారు. రెండు వారాల క్రితమే ఆశ అనే మరో చీతా రెండు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కునో పార్క్‌లో చీతాల సంఖ్య పెరుగుతుండటంతో జంతుప్రేమికులు, పార్క్‌ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. భారత వన్యప్రాణులు వృద్ది చెందుతున్నాయి అంటూ తల్లి వద్ద ఆడుకుంటున్న కూన చీతలకు సంబంధించిన ఓ క్యూట్‌ వీడియోను షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. 2023 మార్చిలో జ్వాలా చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది. ఇక 2022 సెప్టెంబరు 17న ప్రాజెక్టు చీతా’లో భాగంగా మొదటి బ్యాచ్‌లో ఎనిమిది నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. రెండో బ్యాచ్‌లో 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునోకు తీసుకొచ్చారు. అయితే మొత్తం 20 చీతాల్లో 8 చనిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం​ 10 చీతాలు మరణించాయి. గత 75 ఏళ్ల తర్వాత చీతాలు తిరిగి భారత్ గడ్డపై అడుగు పెట్టాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos