Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!

|

May 20, 2024 | 10:01 AM

గ్లోబల్‌ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తుల్లో సముద్ర తీరాల్లోని నివాసాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా సముద్ర మట్టాల పెరుగుదలతో థాయ్‌లాండ్‌ రాజధానిని వేరే చోటుకు తరలించాలనే విషయాన్ని పరిశీలించాలని అక్కడి పర్యావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

గ్లోబల్‌ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తుల్లో సముద్ర తీరాల్లోని నివాసాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా సముద్ర మట్టాల పెరుగుదలతో థాయ్‌లాండ్‌ రాజధానిని వేరే చోటుకు తరలించాలనే విషయాన్ని పరిశీలించాలని అక్కడి పర్యావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. లేదంటే ఈ శతాబ్దం చివరినాటికి బ్యాంకాక్‌ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

నిత్యం రద్దీగా ఉండే థాయ్‌లాండ్‌ రాజధాని, వర్షకాలంలో వరద సమస్యతో పోరాడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఇప్పటికే 1.5 డిగ్రీల సెల్సియస్‌ దాటి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ దాటిన పరిస్థితుల్లో ఉంటే.. ఇప్పటికే సముద్ర నీరు బ్యాంకాక్‌ను తాకుతుందని భావించాలి. ఈ ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడాలంటే తక్షణమే తరలించాల్సిన అవసర ఉంది. కానీ ఇది ఎంతో క్లిష్టమైంది. అయితే , సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెరుగైన చర్యల కోసం అన్వేషిస్తోందని పర్యావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ పావిచ్‌ కేశవవాంగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.