Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

|

Jun 20, 2022 | 5:26 PM

వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా బడి గంటలు మ్రోగాయి.దాదాపు రెండేళ్ల తర్వాత స్టూడెంట్స్ బడిబాట పట్టారు. అయితే వేసవి సెలవులు తర్వాత.. స్కూల్స్ కు వెళ్ళడానికి చాలామంది విద్యార్థులు తమ స్నేహితులను కలుస్తామని..


వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా బడి గంటలు మ్రోగాయి.దాదాపు రెండేళ్ల తర్వాత స్టూడెంట్స్ బడిబాట పట్టారు. అయితే వేసవి సెలవులు తర్వాత.. స్కూల్స్ కు వెళ్ళడానికి చాలామంది విద్యార్థులు తమ స్నేహితులను కలుస్తామని.. కొత్త పుస్తకాలు , కొత్త బ్యాగ్స్ అంటూ ఉత్సాహం చూపిస్తారు. ఉదయమే నిద్రలేచి.. త్వరత్వరగా రెడీ అయి.. స్కూల్ కు వెళ్లారు. అయితే మరికొందరు పిల్లలు మాత్రం ఇందుకు బిన్నంగా వ్యవహరిస్తారు. సెలవుల్లో స్వేచ్ఛగా ఆడింది ఆటగా సాగిన జీవితానికి అలవాటు పడిన చిన్నారులు.. స్కూల్‌కి వెళ్ళడానికి నిరాకరిస్తారు. తాము స్కూల్ కు వెళ్ళం అంటూ మారాం చేస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లలను స్కూల్‌కి పంపించడం తల్లిదండ్రులకు సవాలుగా మారుతుంది. ఇదే ఇబ్బంది సాక్షాత్తు ఓ మహిళా కలెక్టర్‌కు కూడా ఎదురైంది. తన బాబుని స్కూల్ కి దిగబెట్టడానికి వెళ్ళినప్పుడు.. పాఠశాలకు వెళ్లనంటూ మారం చేస్తున్న తన పిల్లాడిని బుజ్జగించడానికి కలెక్టర్ చాలా సమయం పట్టింది.. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన బాబు సారంగ్ ను పాఠశాలలో దిగబెట్టడానికి స్వయంగా వెళ్లారు. అప్పటివరకూ ఆడుకున్న సారంగ్ తరగతి గది లోకి ఎంట్రీ ఇచ్చేముందు.. లోపలి వెళ్లనని మారాం చేశాడు. ఏడుపు మొదలు పెట్టాడు. దీంతో సారంగ్ ను బుజ్జగించి..తరగదిలోకి వెళ్లేలా చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

Follow us on