Bike rider-police: బైక్ రైడర్ కు హెల్మెట్ పెడుతూ.. పోలీసు మంత్రపఠనం.. వైరల్ అవుతున్న వీడియో..
రోడ్డుమీద ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత చెప్పినా కొందరు వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు.
రోడ్డుమీద ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత చెప్పినా కొందరు వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ చాలా ముఖ్యం. తాజాగా ఓ పోలీసు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రజలకు వివరిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బైకర్‌కు హెల్మెట్ పెడుతూ ఓ మంత్రాన్ని పఠించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బైకర్‌కి పోలీసు హెల్మెట్ పెడుతూ ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని వినిపించాడు. అంతేకాదు హెల్మెట్ ఎందుకు ధరించాలో ఆ శ్లోకం ద్వారా చెప్పాడు. పోలీసు అధికారి చెబుతున్న మంత్రం విని బైక్ రైడర్ భార్య నవ్వుతుంది. అంతేకాదు.. మరోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే చలానా విధిస్తామని హెచ్చరించాడు పోలీసు అధికారి. దీంతో బైక్ రైడర్.. ఇక నుంచి ఎప్పుడూ హెల్మెట్ లేకుండా ఎక్కడికీ వెళ్లనని చెప్పాడు. ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్ చేశారు. అంతేకదు వీడియో చూసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. ఒక వినియోగదారు తన శైలి ఎల్లప్పుడూ విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందని కామెంట్ చేశారు. ‘పండిట్ జీ పేరు ఏమిటి? కీర్తన చాలా బాగా చేస్తున్నారని కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..