Treasure Hunt: గుప్త నిధుల కోసం తవ్వకాలు.. అదుపులోకి తీసుకుని విచారించిగా.. తెర వెనుక కధ వేరే లెవల్..
: దొంగ బాబాలు.. సచ్చు సన్నాసులు.. విశ్వాసాల ముసుగులో బురిడీలు.. ఇట్టాంటి బ్యాచ్‌లది ఓ కథ… ఇదిగో ఇప్పుడు చెప్పబోయే గ్యాంగ్ మరో రకం…. వారివి గుడి ఎనక నా సామీ కతలైతే..
దొంగ బాబాలు.. సచ్చు సన్నాసులు.. విశ్వాసాల ముసుగులో బురిడీలు.. ఇట్టాంటి బ్యాచ్‌లది ఓ కథ… ఇదిగో ఇప్పుడు చెప్పబోయే గ్యాంగ్ మరో రకం…. వారివి గుడి ఎనక నా సామీ కతలైతే.. వీళ్లది మాత్రం గుళ్లను గుళ్లో లింగాలను పెకిలించడమే దందా.. గుప్త నిధుల కోసం క్షుద్రపూజల తంతు మొదలెట్టారు. కానీ సత్యసాయి జిల్లా పోలీసుల అప్రమత్తతో ఈ కేటుగాళ్ళ కథ అడ్డం తిరిగింది. పుట్టపర్తి జిల్లా వంకరకుంటలో వీరు క్షుద్రపూజలు చేశారు. నిమ్మకాయలు, మేకలు, పిండిముద్దలు, ఫోటోలు పడాల్సిన కథలు అన్నీ పడ్డారు.ఖమ్మంకు చెందిన నిజామాముద్దీన్ బాబా సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను ఇంటరాగేట్ చేస్తే.. మరో సంచలన నిజం సైతం వెలుగుచూసింది. ప్రకాశ్ అనే మాజీ కానిస్టేబల్ హత్యకు పన్నిన కుట్ర తెరపైకి వచ్చింది. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాష్ భార్య నాగమణి సహకారంతోనే అతని హత్యకు కుట్ర పన్నారు ఈ కేటుగాళ్లు. ప్రధాన నిందితుడు నిజాముద్దీన్ సహా 9మంది నిందితులను అరెస్ట్ చేసి కటకటాలకు పంపించారు. పదేళ్లుగా రాష్ట్రంలో అనేక చోట్ల నిజాముద్దీన్ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తేలింది. వంకరకుంటలో రెండునెలలుగా గుప్త నిధుల వేట సాగిస్తుంది ఈ ముఠా. మొత్తం 9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుల నుంచి రాళ్లు పగలగొట్టే కెమికల్, పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుండగులు హత్య చేయాలని భావించిన మాజీ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ పోలీసులకు రావాల్సిన బకాయిల విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపి వార్తల్లోకి ఎక్కాడు. ఆపై పలు కారణాల చేత అధికారులు డిస్మిస్ చేశారు. అప్పటి నుంచి పోలీస్ శాఖపై, ప్రభుత్వంపై వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..