Manipur: మణిపూర్ లో దారుణం.. పెల్లెట్ గన్నులతో క్రీడాకారుడి తలలో 61 మేకులు..
మైతీ, కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతుంది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నారు. సాయుధ బలగాల కాల్పులలో ఓ జాతీయ క్రీడాకారుడు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటీవల జరిగిన ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులపై సాయుధ బలగాలు విరుచుకుపడ్డాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు ముందస్తు హెచ్చరికలు లేకుండా పెల్లెట్ గన్నులతో జవాన్లు కాల్పులు […]
మైతీ, కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతుంది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నారు. సాయుధ బలగాల కాల్పులలో ఓ జాతీయ క్రీడాకారుడు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటీవల జరిగిన ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులపై సాయుధ బలగాలు విరుచుకుపడ్డాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు ముందస్తు హెచ్చరికలు లేకుండా పెల్లెట్ గన్నులతో జవాన్లు కాల్పులు జరపగా.. జాతీయ క్రీడాకారుడు ఉత్తమ్ సాయిబామ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలలో 61 మేకులు దిగాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరిగి అతడు మైదానంలో దిగుతాడో లేదో తెలియడం లేదు. కాగా, అతని తల ఎక్స్‌రే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనతో మైతీ వర్గీయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. సీఎం బీరేన్‌సింగ్ వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. సాయుధ దళాలు రాష్ట్ర పరిధిలోకి రావని, వారిని నియంత్రించే అధికారం తనకు లేదని ఆయన చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..