Doctor: షాపింగ్ చేస్తుండగా కుప్పకూలిన వ్యక్తి.. అక్కడే ఉన్న డాక్టర్ ఏం చేశాడంటే.. మానవత్వం అంటే ఇదే..
ప్రముఖ షాపింగ్ మాల్ ఐకియాలో షాపింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన అక్కడే ఉన్న ఓ డాక్టర్ వెంటనే అప్రమత్తమై అతడికి ప్రాణం పోశాడు.
ప్రముఖ షాపింగ్ మాల్ ఐకియాలో షాపింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన అక్కడే ఉన్న ఓ డాక్టర్ వెంటనే అప్రమత్తమై అతడికి ప్రాణం పోశాడు. ఆ వ్యక్తికి వెంటనే CPR చేసాడు. ఆ సమయంలో డాక్టర్‌కు తోడుగా ఇద్దరు IKEA ఉద్యోగులు కూడా సహాయం చేశారు. సుమారు 10 నిమిషాల హైటెన్షన్ అనంతరం ఆ వ్యక్తి తిరిగి స్పృహలోకి వచ్చాడు. దాంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన బెంగళూరులోని IKEA స్టోర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను డాక్టర్ కుమారుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యక్తిగత పనుల్లో వున్నపుడు కూడా ఆ డాక్టర్ తన వృత్తి పట్ల చూపిన అంకిత భావాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

