CC tv Viral Video: స్కూటీని ఢీకొన్న ఇన్నోవా వాహనం.! షాక్ కు గురి చేస్తున్న సీసీ కెమెరా ఎక్సక్లూసివ్ విజువల్స్..
కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మలప్పురంలోని కుట్టిపురం-తిరూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్ ఖాదర్, తన భార్య రుకియాతో కలసి స్కూటీ మీద ప్రయాణిస్తున్న సమయంలో
కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మలప్పురంలోని కుట్టిపురం-తిరూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్ ఖాదర్, తన భార్య రుకియాతో కలసి స్కూటీ మీద ప్రయాణిస్తున్న సమయంలో ఇన్నోవా వాహనం.. బైక్‌ను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. స్కూటీపై వెళ్తున్న సమయంలో ఎదురుగా రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన ఇన్నోవా వాహనం.. టూవీలర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ ఒక్కసారిగా గాల్లోకి బంతిలా ఎగిరికిందపడ్డారు. ఈ క్రమంలో అబ్దుల్ ఖాదర్ తల డివైడర్‌కు బలంగా తగలడంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. అతని భార్య రుకియాను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యూఏఈలో పనిచేస్తున్న అబ్దుల్ ఖాదర్ కొద్దిరోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఖాదర్, అతని భార్య రుకియా తవనూరులో బంధువుల వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా విషాదం చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..