Pulasa: యానాం మార్కెట్‌కు పులస.. భారీ ధరకు దక్కించుకున్న మహిళ.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..
ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే చేప పులస. ఈ చేప కోసం ఏడాది పొడవునా జిల్లావాసులు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెతను నిజం చేస్తూ..
ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే చేప పులస. ఈ చేప కోసం ఏడాది పొడవునా జిల్లావాసులు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెతను నిజం చేస్తూ.. తాజాగా ఓ మహిళ భారీ మొత్తం వెచ్చించి వేలంపాటలో చేపను కొనుగోలు చేశారు. యానాం చేపల మార్కెట్ లో పులస చేప సందడి నెలకొంది. మంగళవారం రేవులో భైరవపాలెంకు చెందిన వ్యక్తి పులసకు వేలంపాట నిర్వహించారు. సుమారు 2 కిలోల బరువున్న తాజా పులస చేపను పార్వతి అనే మహిళ భారీ ధరకు కొనుగోలు చేసింది. పులస ను వేలం పాటలో 19 వేల రూపాయలకు కొనుగోలు చేసింది పార్వతి. ప్రస్తుత సీజన్ లో పులసల అమ్మకం మొదలయ్యాక ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..