Viral Video: మరదలు పెట్టిన చిచ్చుకు వరుడు బలి.. పీఠల మీదే పెళ్లిని క్యాన్సిల్..!

|

Jun 26, 2023 | 8:07 AM

బావను ఆటపట్టించడానికి మరదలు అడిగిన ఓ ప్రశ్న ఏకంగా పెళ్లినే ఆపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో గల సైద్‌పూర్‌కు చెందిన శివశంకర్‌కు.. బసంత్ పట్టి నివాసి రంజనతో వివాహం నిశ్చయమైంది. ఇరువురి కుటుంబాలు పరస్పర అంగీకారంతో వివాహాన్ని నిశ్చయించుకున్నాయి.

బావను ఆటపట్టించడానికి మరదలు అడిగిన ఓ ప్రశ్న ఏకంగా పెళ్లినే ఆపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో గల సైద్‌పూర్‌కు చెందిన శివశంకర్‌కు.. బసంత్ పట్టి నివాసి రంజనతో వివాహం నిశ్చయమైంది. ఇరువురి కుటుంబాలు పరస్పర అంగీకారంతో వివాహాన్ని నిశ్చయించుకున్నాయి. పెళ్లికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా బసంత్ పట్టికి చేరుకున్నాడు. వధువు కుటుంబ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఇంతలో వధువు చెల్లెలు వచ్చి కాబోయే బావగారిని మన దేశ ప్రధాని ఎవరు? అని ప్రశ్న వేసింది. దాంతో వరుడు అసౌకర్యానికి గురయ్యాడు. మరదలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులందరూ కామెంట్స్ చేశారు. ప్రధాని పేరు చెప్పలేకపోవడాన్ని అవమానంగా భావించిన వధువు.. ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది. అందరూ షాకయ్యారు. అయితే ఈ పెళ్లికి వరుడు తమ్ముడు అనంత్ కూడా వచ్చాడు. పెద్దవాడు కాకపోతే చిన్నవాడిని పెళ్లి చేసుకోవాలంటూ వరుడి తండ్రి కోరాడు. దానికి వధువు కుటుంబ సభ్యులు నిరాకరించారు. కాసేపు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన వరుడి తండ్రి తన తుపాకీతో వధువును బెదిరించాడు. తన చిన్న కొడుకును పెళ్లి చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో బెదిరిపోయిన అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన తరువాత.. వధువును తమ ఇంటికి తీసుకువచ్చారు వరుడి తల్లిదండ్రులు. ఆ వెంటనే వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. తమ అమ్మాయిని తమ వెంట పంపాలంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదంపై పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత సైలెంట్ అయ్యారు. అయితే, ఈ వివాదంపై స్పందించిన పోలీసులు.. తమకు ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..