Elephant dance: ‘ఈ వర్షం సాక్షిగా’.. అంటూ డ్యాన్స్‌ చేస్తున్న ఏనుగు.. వీడియో చూసి నెటిజన్లు ఫిదా…

Updated on: Aug 06, 2022 | 8:59 AM

నిత్యం సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా వన్యప్రాణుల వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. వాటి జీవనశైలి దగ్గరనుంచి చూసే అవకాశం కలుగుతుంది.


నిత్యం సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా వన్యప్రాణుల వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. వాటి జీవనశైలి దగ్గరనుంచి చూసే అవకాశం కలుగుతుంది. అందుకే నెటిజన్లు వాటిని బాగా ఇష్టపడతారు. తాజాగా నెట్టింట ఓ ఏనుగు డాన్స్‌ చేస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. సాధారణంగా ఏనుగులు ఎక్కువగా నీరు, బురదలో ఆడటానికి ఇష్టపడతాయి. వాటి వెచ్చని స్వభావం కారణంగా, ఏనుగులు వర్షపు నీటితో అలసట తీర్చుకుంటాయి. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఏనుగు బురదగుంటలో పడుకొని ఉంది. పైన వర్షం పడుతోంది. దాంతో ఆ ఏనుగు పైకి లేచి మెల్లగా డాన్స్‌ చేయడం మొదలు పెట్టింది. బురదలో పొర్లుతూ.. కాళ్లతో ఆ బురదను అటూ ఇటూ చిమ్ముతూ ఇష్టం వచ్చినట్లు ఆడుతోంది. ఆ పక్కనే ఇంకో ఏనుగు మాత్రం వర్షంలో తడుస్తూ సేదతీరుతోంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలమంది లైక్‌ చేస్తూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 06, 2022 08:59 AM