Pit-bull Dog Attack: అరరే కుక్క ఎంత పని చేసింది..! పిట్‌బుల్‌ చేసిన పనికి.. కుక్క యజమాని కుటుంబం పరార్.!

Updated on: Dec 05, 2022 | 8:59 AM

కర్ణాటకలో పెంపుడు కుక్క చేసిన పనికి దాని యాజమాని కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఇంతకీ అదేం చేసిందనుకుంటున్నారా..? మనదేశంలో నిషేధించిన పిట్‌బుల్‌ జాతి కుక్క బాలునిపై పడి కరిచింది.


టూషన్‌కు వెళుతున్న విద్యార్థిని కరవడంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. హుబ్లీ బంకాపుర చౌక్‌ వద్ద పాటిల్‌ గల్లీలో జరిగిన ఘటనలో పవన్‌ అనిల్‌ దొడ్డమని అనే బాలునికి తీవ్రగాయాలు అయ్యాయి. గురుసిద్దప్ప చెన్నోజీ అనే వ్యక్తికి చెందిన కుక్క కాంపౌండ్‌ నుంచి ఎగిరి వచ్చి బాలుని మీద దాడి చేసిందని బెణ్ణిగేరి పోలీసులు తెలిపారు.కాగా ఈ ఘటనతో సదరు కుక్క యజమాని దాన్ని తీసుకుని కుటుంబంతో సహా ఇళ్లు విడిచి పరారయ్యాడు. అతడు మాజీ కార్పొరేటర్‌ బంధువు అని పోలీసులు చెబుతున్నారు. పిట్‌బుల్‌ జాతి కుక్కలు ఉద్రేకమైనవని, ఉట్టి పుణ్యానికే జనం మీద పడి కరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో భారత ప్రభుత్వం వీటి పెంపకాన్ని నిషేధించింది. అయినప్పటికీ కొందరు దొంగచాటుగా వీటిని పెంచుకోవడం జరుగుతోంది. అమెరికా వంటి విదేశాల నుంచి ఈ కుక్కలను గతంలో దిగుమతి చేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 05, 2022 08:59 AM