Viral Video: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్‌ చేయగానే కోట్ల నిధి.. వీడియో.

|

Aug 16, 2023 | 3:53 PM

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. మన దరికి చేరినా గుర్తించకపోతే ఏం చేయలేం. కానీ, వచ్చిన అదృష్టాన్ని, కలిసి వచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే దెబ్బకు దశ తిరిగిపోతుంది. ఓ వ్యక్తి జీవితంలో ఇదే జరిగింది. ఓ పాత అల్మారా ఓ వ్యక్తి జీవన గతినే మార్చేసింది. రాత్రికి రాత్రి కరోడ్‌పతి అయిపోయాడు. అతను చేసిందల్లా జస్ట్ 500 డాలర్లు పెట్టి ఓ పాత అల్మారా కొనుక్కోవడమే.

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. మన దరికి చేరినా గుర్తించకపోతే ఏం చేయలేం. కానీ, వచ్చిన అదృష్టాన్ని, కలిసి వచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే దెబ్బకు దశ తిరిగిపోతుంది. ఓ వ్యక్తి జీవితంలో ఇదే జరిగింది. ఓ పాత అల్మారా ఓ వ్యక్తి జీవన గతినే మార్చేసింది. రాత్రికి రాత్రి కరోడ్‌పతి అయిపోయాడు. అతను చేసిందల్లా జస్ట్ 500 డాలర్లు పెట్టి ఓ పాత అల్మారా కొనుక్కోవడమే. ఆ అల్మారానే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.ఓ వెబ్‌సైట్ కథనం ప్రకారం అమెరికాకు చెందిన డాన్ డాట్సన్, అతని భార్య లారా సోషల్ మీడియాలో ఒక క్లిప్‌ను షేర్ చేశారు. ఓ మహిళ తమవద్దకు వచ్చి అవసరం మీద తనవద్ద ఉన్న పాత అల్మరా ఒకటి అమ్ముతున్నానని, అది కొనుక్కోవాల్సిందిగా కోరిందని, దాంతో వారు ఆ అల్మరాను కొనుగోలు చేసినట్టు అందులో పేర్కొన్నారు. ఇందుకు 500 డార్లు ఖర్చు చేశామన్నారు. అంటే ఈ పాత వార్డ్ రోబ్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి పరిశీలించగా అది చాలా బరువుగా ఉందని, దానిని తెరవడం చాలా కష్టమైందని తెలిపారు. దాంతో డోర్ ఓపెన్ చేయడానికి మరొక వ్యక్తిని పిలిచామని, ముగ్గురూ కలిసి అతికష్టంమీద సేఫ్‌ను తెరవగా అందులో పెద్దమొత్తంలో నగదు కనిపించిందని తెలిపారు. అందులో 7.5 మిలియన్ డార్లు అంటే దాదాపు 62 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఈ విషయం తెలిసిన రోబ్‌ పాత ఓనర్‌ లాయర్‌తో సహా వచ్చి ఈ దంపతులను సంప్రదించి ఆ డబ్బును తనకు అప్పగించాలని, ప్రతిఫలంగా 6 లక్షల డాలర్లు అంటే దాదాపు 5 కోట్లు ఇస్తామని చెప్పారు. దానికి వారు అంగీకరించకపోవడంతో సదరు న్యాయవాది ఫైనల్‌గా 10 కోట్లకు వారిని ఒప్పించాడు. వారు కొనుగోలు చేసిన వార్డ్ రోబ్‌ను ఆ మహిళకు తిరిగి ఇచ్చేసారు. కేవలం 500 డాలర్లతో కొనుగోలు చేసిన వార్డ్ రోబ్ 10 కోట్లకు యజమానిని చేసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...